ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై విచారణ
జూపాడుబంగ్లా: కనకయ్యకొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇంగ్లిష్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు కడుమూరు రవిపై డిప్యూటీ డీఈఓ శంకర్‌ప్రసాద్ విచారణ చేపట్టారు. ‘విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై నంద్యాల డీఈఓ జనార్ధన్‌రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో డిప్యూటీ డీఈఓ మంగళవారం ఉదయం 10 గంటల్లోగా కనకయ్యకొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని జూపాడుబంగ్లా ఎంఈఓ–1 చిన్నమద్దిలేటితో కలిసి విచారణ చేపట్టారు. పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, విద్యార్థినులు, తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆరాతీశారు. పలువురు విద్యార్థినులు కడుమూరు రవి ప్రవర్తన తీరును వివరించటంతో పాటు లిఖితపూర్వకంగా డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలకు తెలియజేశారు. ఇందుకు మొదటి తప్పుగా భావించి తనను క్షమించాలని లిఖితపూర్వకంగా తెలియజేసి క్షమాపణలు కోరినట్లు ఎంఈఓ చిన్నమద్దిలేటి తెలిపారు. కాగా విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డిప్యూటీ డీఈఓ తెలిపారు.
తప్పిపోయిన బాలుడి అప్పగింత
ఆత్మకూరురూరల్: బేతంచెర్ల మండలం పేరాయ పల్లె గ్రామానికి చెందిన పది సంవత్సరాల బా లుడు తన అమ్మమ్మతో కలసి శ్రీశైలానికి పాదయాత్రగా వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున భీముని కొలను దగ్గర తన అమ్మమ్మ నుంచి విడిపో యి తప్పిపోయాడు. స్థానికంగా విధినిర్వహణలో ఉన్న అటవీ సిబ్బంది బాలుడిని గుర్తించారు. అయి తే పేరు చెప్పడానికి కూడా భయపడుతున్న ఈ బాలుడిని చివరకు అతి కష్టం మీద అతని అమ్మమ్మ నాగలక్ష్మి వద్దకు చేర్చారు అటవీ సిబ్బంది.
ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై విచారణ


