భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం

Feb 9 2026 7:26 AM | Updated on Feb 9 2026 7:26 AM

భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం

భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం

భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీగిరి చేరుకుంటున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఈ బస్సులు కై లాస ద్వారం నుంచి శ్రీశైల క్షేత్రం వరకు వెళ్లనున్నాయి. నందిసర్కిల్‌ నుంచి గణేశసదన్‌, సెంట్రల్‌ పార్కింగ్‌, విభూతిమఠ జంక్షన్‌, మల్లమ్మ కన్నీరు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రపార్క్‌, సిద్దరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేట్‌ సత్రాల మీదుగా మళ్లీ నందిసర్కిల్‌ చేరుకుంటాయి. ప్రస్తుతం నాలుగు బస్సులు ఉండగా, 10, 11న ఎనిమిది, 12 నుంచి 16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులు భక్తులకు అందుబాటులో ఉంచుతామని దేవస్థాన అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement