ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ

Feb 1 2026 3:11 AM | Updated on Feb 1 2026 3:11 AM

ఎద్దు

ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ

● ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిఽధిలోని చెన్నాపురం గ్రామం మలుపు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కోటేకల్‌ గ్రామానికి చెందిన బోయ ఉరకుందు ఎద్దుల బండిపై గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి తమిళనాడుకు చెందిన లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఎద్దుల బండి ఎదురుగా వస్తున్న బోలెరోను ఢీకొట్టడంతో బండిపై ఉన్న బోయ కురుకుంద, ఎమ్మిగనూరుకు చెందిన బొలెరో డ్రైవర్‌ ఉరుకుందకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బండి పూర్తిగా ధ్వంసం కాగా, ఎద్దు కొమ్ము విరిగి గాయపడింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్‌, వాష్‌ అండ్‌ గో

కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీ సులు జిల్లా అంతటా చర్యలు చేపట్టారు. రహదారులపై శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివా రం తెల్లవారుజాము వరకు స్టాప్‌, వాష్‌ అండ్‌ గో కార్యక్రమంలో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్‌ డివిజన్లలోని జాతీయ రహదారులలో లారీలు, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలెరో వాహనాలను ఆపి వాహన సంబంధిత పత్రాలు, లైసెన్సులతో పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. తెల్లవారుజామున కునుకు తీయకుండా ముందు జాగ్రత్తగా డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి జా గ్రత్తలు సూచించారు. అతి వేగంతో నడపరాదని, రాంగ్‌ రూట్‌లలో వెళ్లకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

సబ్‌ జైల్‌ ఆకస్మిక తనిఖీ

నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్‌ జైల్‌ను మండల లీగల్‌ సెల్‌ చైర్మన్‌, మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి జైలులో ఏర్పాటు చేసిన ప్రిజన్‌ లీగల్‌ హెల్ప్‌ ఐఎడ్‌ డెస్క్‌, క్లినిక్‌ను తనిఖీ చేసి దాని గురించి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే లీగల్‌ సెల్‌ హెల్ప్‌లైన్‌ 15100 సమాచారం ఇవ్వాలన్నారు. వృద్ధ, పేద ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జైలు అధికారి గురు ప్రసాద్‌ రెడ్డి, లోక్‌ అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

మహిళ అదృశ్యం

నంద్యాల(అర్బన్‌): మండలంలోని అయ్యలూరు మెట్ట గ్రామానికి చెందిన సుప్రియ అదృశ్యమైనట్లు రూరల్‌ పోలీసులు తెలిపా రు. ఈనెల 29వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరిన సుప్రియ తిరిగి ఇంటికి రాలేదు. ఈ మేరకు భర్త ప్రశాంత్‌ బంధువులు, సన్నిహితుల వద్దకు వెళ్లి విచారించినా ప్రయోజనం లేకుండా పోయింది. సుప్రియ కనిపించలేదంటూ శనివారం ప్రశాంత్‌ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ 1
1/2

ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ

ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ 2
2/2

ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement