అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి | - | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి

Feb 1 2026 3:11 AM | Updated on Feb 1 2026 3:11 AM

అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి

అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి

దేవుడి పేరు చెప్పుకుని ప్రజలను మభ్య పెడుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామీ అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కోరారు. ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్‌లో కొలువై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వెంకటేశ్వరస్వామికి టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరాయన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక మహిళను అత్యాచారం చేసి ఐదుసార్లు అబార్షన్‌ చేయించిన ఘనత ఆ ఎమ్మెల్యేకే చెల్లించిందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement