పాప ప్రక్షాళన చేసుకోండి
తిరుపతి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చేశారని, వారు తమ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హితువు పలికారు. కృష్ణగిరి మండలం కర్ల కుంట గ్రామం తిరుమలరాయుడు స్వామి దేవాలయంలో శనివారం ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ఎదుట టెంకాయలు కొట్టారు. భక్తుల మనోభావాలను గాయపరిచిన ‘కూటమి’ నేతలు బహిరంగ క్ష మాపణ చెప్పాలనే పోస్టర్‌ను అవిష్కరించారు. హిందువుల మనోభావాలను కించపరచిన సీఎంచంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంలు తిరుమలలో ముక్కును నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


