నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధర | - | Sakshi
Sakshi News home page

నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధర

Feb 7 2026 10:13 AM | Updated on Feb 7 2026 10:13 AM

నాణ్య

నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధర

సూక్ష్మ సేద్యం లక్ష్యాలు సాధిద్దాం

కర్నూలు(అగ్రికల్చర్‌): వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్‌ చేసుకొని నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధరలు లభిస్తాయని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఒక రైతు తెచ్చిన వాములో మట్టి, పొట్టు, పుల్లలు అధికంగా ఉండటంతో క్వింటాకు రూ.11 వేలు మాత్రమే ధర లభించిందన్నారు. ఆ సమయంలో తాము తనిఖీ చేయగా రైతు ఈ ధరకు అమ్మానని, క్యాన్సిల్‌ చేసుకుంటానని తెలుపడంతో అంగీకరించామన్నారు. వామును అక్కడే క్లీన్‌ చేసుకొని శుక్రవారం అమ్మకానికి పెట్టడంతో క్వింటా ధర రూ.24 వేలు పలికిందన్నారు.

నేటి నుంచి టమాట విక్రయాలు నిలిపివేత

పత్తికొండ: వ్యవసాయ మార్కెట్‌లో శనివారం నుంచి టమాట విక్రయాలను నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌యార్డు కార్యదర్శి కార్నలిస్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో టమాట దిగుబడి ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వెళ్లారన్నారు. ఈ నేపథ్యంలో టమోట విక్రయాలను నిలుపుదల చేశామన్నారు. ఇతర కూరగాయల మార్కెట్‌ రోజూ యథావిధిగా కొనసాగుతుందన్నారు.

8న పోస్టల్‌ ఉద్యోగుల ద్వైవార్షిక మహాసభలు

కర్నూలు(అర్బన్‌): కర్నూలు డివిజన్‌ ఎన్‌ఎఫ్‌పీఈ గ్రూప్‌ సీ, పోస్ట్‌మెన్‌, ఎంటీఎస్‌, జీడీఎస్‌ యూనియన్లు సంయుక్తంగా ద్వైవార్శిక మహాసభలను ఈ నెల 8న స్థానిక ప్రధాన తపాల కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు యూనియన్‌ నాయకులు గిరిబాబు, ఈశ్వరయ్య, శమంతకరెడ్డి, లక్ష్మికాంత్‌, మహ్మద్‌జానీ, రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక హెడ్‌ పోస్టాఫీసు ప్రాంగణంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలకు రాష్ట్ర నాయకులు శ్రీధర్‌, మురళీతో పాటు అఖిల భారత నాయకులు కూడా హాజరవుతారన్నారు. మహాసభల్లో ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తామన్నారు. అలాగే మూడు యూనియన్లకు సంబంధించి నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నట్లు తెలిపారు.

బాల్య వివాహాలు నేరం

మంత్రాలయం రూరల్‌: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అటువంటి వివాహాల సమాచారం తెలిస్తే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098కు సమాచారం ఇవ్వాలని ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్ట్‌ అధికారి విజయ తెలిపారు. మంత్రాలయం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వేదిక ఆవరణలో సీడీపీవో రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లతో సమావేశాన్ని నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. డిస్టిక్‌ కో ఆర్డినేటర్‌ బాలు, వన్‌స్టాఫ్‌ సెంటర్‌ అధికారి స్వప్న, నాలుగు మండలాల ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్స్‌, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇచ్చిన సూక్ష్మ సేద్యం లక్ష్యాలను అధిగమించేందుకు పట్టుదలతో పనిచేయాలని ఉద్యానశాఖ కమిషనరేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ పుల్లారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలులోని ఉద్యాన భవన్‌లో కంపెనీల డీసీవోలు, ఎంఐ ఇంజినీర్లు తదితరులుతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 14 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 9,750 హెక్టార్లు పూర్తి చేశారన్నారు. మార్చి 15లోపు వంద శాతం లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, ఇతర రైతులకు 10 ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్య సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొ న్నారు. బిందు, స్ప్రింక్లర్ల పరికరాలపై జీఎస్‌టీని తగ్గిందని, యూనిట్‌ వ్యయంపై 7 శాతం ఆదా అవుతుందన్నారు. ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఆదనపు పీడీ ఫిరోజ్‌ఖాన్‌, నంద్యాల జిల్లా పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధర  1
1/1

నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement