పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత

Feb 8 2026 4:02 AM | Updated on Feb 8 2026 4:02 AM

పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత

పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత

జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌

ఆత్మకూరు: శ్రీశైలం పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపా రు. శివభక్తులు పాదయాత్రగా వెళ్లే వెంకటాపురం – నాగలూటి అటవీ మార్గాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అటవీ మార్గంలో ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షలాదిగా తరలివచ్చే మల్లన్న భక్తులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాలినడకన వచ్చే భక్తులు మార్గమధ్యలో గత ఏడాది ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశామన్నారు. అటవీ మార్గంలో అస్వస్థకు గురైన భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు పెచ్చెరువు ప్రాంతంలో వైద్యశాల అందుబాటులో ఉందన్నారు. అటవీ మార్గంలో భక్తులు తప్పనిసరిగా అటవీ శాఖ నిబంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్‌, సీఐ మహేశ్వర్‌రెడ్డి, పాములపాడు ఎస్‌ఐ తిరుపాల్‌, ఆత్మకూరు రేంజ్‌ ఆఫీసర్‌ ప్రణతిబాయి, డీఆర్వో జాకీర్‌హుసేన్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement