తుది ఎంపిక జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

తుది ఎంపిక జాబితా విడుదల

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

తుది

తుది ఎంపిక జాబితా విడుదల

రోగులకు మెరుగైన సేవలందించాలి

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలులోని స్టేట్‌ క్యా న్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మెడికల్‌ ఫిజిసిస్ట్‌, ఓటీ అసిస్టెంట్‌, అనెస్తీషియా టెక్నీషియన్‌ అభ్యర్థుల తుది ఎంపిక జాబితా ఫేస్‌–2 విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 జనవరి 29న జారీ చేసిన నియామక నోటిఫికేషన్‌ 01/2024కు సంబంధించి ఈ పోస్టులను 1:2 రేషియో పద్ధతిన లిస్ట్‌ తయారైందన్నారు. జాబితా కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్‌సైట్స్‌, కర్నూలు మెడికల్‌ కాలేజి వెబ్‌సైట్‌లలో (https://kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in, https://kurnoolmedicalcollege.ac.in) అప్‌లోడ్‌ చేశామన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, నకలుతో ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపల్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ కార్యాలయంలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు.

ముగిసిన ప్రాక్టికల్‌ పరీక్షలు

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. గత నెల 27వ తేది నుంచి వొకేషనల్‌ ప్రాక్టికల్‌, ఈ నెల 1వ తేది నుంచి జనరల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజున 37 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు నిర్వహించగా 1,184 మందిలో 1,074 మంది పరీక్షకు హాజరయ్యారు.

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠం హుండీ ఆదాయం లెక్కించగా రూ.3,08,37,571 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 21 రోజుల హుండీ కానుకలు లెక్కించారు. అందులో నగదు రూపేణా రూ.2.98,13,571, నాణేలా రూపంలో రూ.10,24,000 వచ్చినట్లు మేనేజర్‌ శ్రీనివాసరావు వివరించారు. అలాగే 13 గ్రాముల బంగారం, 1080 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు మేనేజర్‌–2 వెంటేష్‌ జోషి, ఏఏఓ మాధవశెట్టి తెలిపారు.

పెద్దకడబూరు: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడి రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు. మంగళవారం ఆమె పెద్దకడబూరు మండల కేంద్రంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గ్రామంలోని 1వ వార్డులో పర్యటించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రోగులు కూర్చోవడానికి సరైన వసతులు లేకపోవడం, వేస్ట్‌(చెత్త) ఎక్కడ పడితే అక్కడ వేయడం, రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి నేపథ్యంలో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంటికి పంపుతానని హెచ్చరించారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎంపీడీఓ ప్రభావతిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఆదోని ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌, డీఎస్‌ఓ రఘువీర్‌, అధికారులు పాల్గొన్నారు.

తుది ఎంపిక జాబితా విడుదల 1
1/1

తుది ఎంపిక జాబితా విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement