ఫుడ్‌ బాస్కెట్‌తో సురక్షిత ఆహారం | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ బాస్కెట్‌తో సురక్షిత ఆహారం

Feb 11 2026 7:49 AM | Updated on Feb 11 2026 7:49 AM

ఫుడ్‌ బాస్కెట్‌తో సురక్షిత ఆహారం

ఫుడ్‌ బాస్కెట్‌తో సురక్షిత ఆహారం

కర్నూలు (అగ్రికల్చర్‌): ఫుడ్‌ బాస్కెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ప్రకృతి వ్యవసాయ పద్ధతు ల్లో పండించిన సురక్షిత ఆహారం అందించేందుకు తగి న చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.వి.రమణారెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలు శివారులోని టీటీడీసీ సమావేశ మందిరంలో సెర్ఫ్‌, ఆర్‌వైఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫుడ్‌ బాస్కెట్‌ కార్యాచరణ, న్యూట్రీ ఎంటర్‌ప్రైజెస్‌ స్థాపనపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫుడ్‌ బాస్కెట్‌ ద్వారా ప్రతి కుటుంబానికి నిరంతరం పోషకాలతో కూడిన సురక్షితమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. గ్రామ సంఘాల ప్రతినిధులు ఫుడ్‌ బాస్కెట్‌పై పొదుపు మహిళలకు సమగ్ర అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి గ్రామానికి రూ.లక్షతో ఫుడ్‌ బాస్కెట్‌ నిధి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌వైఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ అరుణ, జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్‌ మాధురి, డీపీఎం నరసమ్మ, వివిధ మండలాల సీసీలు, ఆర్‌వైఎస్‌ఎస్‌ సిబ్బంది, గ్రామైక్య సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement