● టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక దందా ● చోద్యం చూస్తున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక దందా ● చోద్యం చూస్తున్న అధికారులు

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

● టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక దందా ● చోద్యం చూస్తున్న

● టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక దందా ● చోద్యం చూస్తున్న

● టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక దందా ● చోద్యం చూస్తున్న అధికారులు

తుంగభద్రలో ఇసుక తోడేళ్లు

నందవరం : తెలుగు తమ్ముళ్ల ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో నాగలదిన్నె, చిన్నకొత్తిలి, నదికై రవాడి, గంగవరం గ్రామాల్లో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల్లో నది ఒడ్డు నుంచి కొందరు ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక రవాణా దందాకు అధికారపార్టీ నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి.

అక్రమ రవాణా సాగుతుందిలా..

మండలంలోని నాగలదిన్నె, చిన్నకొత్తిలి, గంగవరం, నదికై రవాడి, గురజాల గ్రామాల్లోని తుంగభద్ర నది ఒడ్డు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఎమ్మిగనూరుకు తరలిస్తున్నారు. 10 ట్రాక్టర్ల ద్వారా రోజుకు 100 ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తున్నారు. నాగలదిన్నె మీదుగా కె. పేట, కనకవీడు గ్రామాల నుంచి, అలాగే మిట్ట సోమపురం, సోమలగూడూరు గ్రామాల నుంచి ఇసుకను తరలిస్తూ దందా సాగిస్తున్నారు.

ముంచుకొస్తున్న నీటి ఎద్దడి..

తుంగభద్ర నదిలో నుంది అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాగలదిన్నె గ్రామంలో తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అక్కడ ఇసుకలో నీటి గుమ్మీలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఇసుకాసురులు నీటి గుమ్మీల వద్దనే ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో నాగలదిన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement