పోలీసు డాగ్‌ ‘టీనా’ మృతి | - | Sakshi
Sakshi News home page

పోలీసు డాగ్‌ ‘టీనా’ మృతి

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

పోలీస

పోలీసు డాగ్‌ ‘టీనా’ మృతి

కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో 9 ఏళ్ల పాటు సేవ లందించిన పోలీస్‌ డాగ్‌ టీనా వృద్ధాప్య సమస్యలతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఇది ల్యాబ్‌ బ్రీడ్‌ జాతికి చెందిన ఫీమేల్‌ జాగిలం. టీనా మృతదేహానికి దిన్నెదేవరపాడు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏఆర్‌ పోలీసు అధికారులు, డాగ్‌ స్క్వాడ్‌ పోలీసు సిబ్బంది కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మందు పాతరలు పసిగట్టడంలో దిట్ట

మందు పాతరలను పసిగట్టడంలో టీనా దిట్ట. వివిధ వీఐపీ బందోబస్తులో, పీఎం, సీఎం బందోబస్తు విధులలో మంచి సేవలు అందించింది. ఎన్నికల విధులు, శ్రీశైలం శివరాత్రి, ఉగాది ఉత్సవాలు, వీఐపీ విజిట్స్‌, మంత్రాలయం, తిరుమల బ్రహ్మోత్సవాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిందని టీనా సేవలను పోలీసు అధికారులు కొనియాడారు. 2013లో పది నెలల పాటు తెలంగాణ, మొయినాబాద్‌ ఐఐటీఏలో కఠోర శిక్షణ పూర్తి చేసుకుని 2014లో జిల్లాకు వచ్చింది. నాటి నుంచి నుంచి డాగ్‌ హ్యాండ్లర్‌గా ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుంకిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

పోలీసు డాగ్‌ ‘టీనా’ మృతి 1
1/1

పోలీసు డాగ్‌ ‘టీనా’ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement