రెండో పంటకు అవకాశం లేకనే వలస | - | Sakshi
Sakshi News home page

రెండో పంటకు అవకాశం లేకనే వలస

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

రెండో

రెండో పంటకు అవకాశం లేకనే వలస

రెండో పంటకు అవకాశం లేకనే వలస ●

రబీలో భూములు ఖాళీ

మాకు ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది. ఖరీఫ్‌లో పత్తి సాగు చేశాం. గత ఏడాది నవంబర్‌ నెలకే పూర్తయింది. రెండో పంట లేకపోవడంతో ఉపాధి కరువైంది. అరకొరగా కల్పిస్తున్న ఉపాధి పనులకు వెళ్లినా వేతనాలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. బతుకుదెరువుకు గుంటూరు ప్రాంతానికి వలస వచ్చాం.

– ఈడిగ శ్రీనివాసులు, కామన్‌దొడ్డి,

కోసిగి మండలం

మాకు ఐదు ఎకరాల భూమి ఉంది. వర్షాధారం కిందనే వ్యవసాయం. ఖరీఫ్‌లో కంది సాగు చేశాం. అయిదు నెలల పాటు రేయింబవళ్లు కష్టపడితే 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ పంట నవంబర్‌ నెలకే పూర్తయింది. రబీలో ఈ భూములను ఖాళీగా ఉంచుకున్నాం. పశ్చిమ ప్రాంతం మీదుగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నా రెండో పంట వేసుకునే అవకాశం లేకపోతోంది.

– మధుసూదన్‌రెడ్డి, ఆస్పరి

సాగునీటి వసతి లేక పశ్చి మప్రాంతం పూర్తిగా వెనుకబడింది. రెండో పంటకు అవకాశం ఉంటే పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు ఉండవు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు సాకారమైతేనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వైఎస్సార్‌సీపీ పాలనలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కదలిక వచ్చింది. డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది.

– నాగభూషణం రెడ్డి, రైతు,

హెబ్బటం, హొళగుంద మండల

రెండో పంటకు అవకాశం లేకనే వలస 1
1/2

రెండో పంటకు అవకాశం లేకనే వలస

రెండో పంటకు అవకాశం లేకనే వలస 2
2/2

రెండో పంటకు అవకాశం లేకనే వలస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement