మద్దమాంబకు నీరాజనం
● వైభవంగా అమ్మవారి రథోత్సవం
అశేష భక్తజనం మధ్య రథోత్సవం
మద్దికెర: మద్దమాంబ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మండల కేంద్రం మద్దికెరలో వెలసిన ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. మంగళవారం ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కంకుమార్చన, విశేషపూజలు, మహామంగళ హారతి తదితర కార్యక్రమాలతో పాటు నైవేద్యం సమర్పించారు. భక్తులు అమ్మవారికి ఆకు పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు ఊరేగింపుగా తీసుకొని వచ్చి రథంలో కొలువుంచారు. అనంతరం రథం ముందు హోమం కాల్చి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు మద్దమాంబకు జై అంటూ రథాన్ని ముందుకు లాగారు. రథం పైకి అరటిపండ్లను విసిరి భక్తిని చాటుకున్నారు. ఈ వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మద్దమాంబకు నీరాజనం


