పిన్నాపురం వృషభాల జయకేతనం
తుగ్గలి : మస్తానయ్యస్వామి ఉరుసు సందర్భంగా ఆదివారం ముక్కెల్లలో నిర్వహించిన రాతి దూలం లాగుడు పోటీల్లో పాణ్యొం మండలం పిన్నాపురం వృషభాలు విజేతగా నిలిచాయి. పోటీలను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రారంభించారు. పోటీల్లో పిన్నాపురం వెంకటకృష్ణయ్య వృషభాలు 3,874 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. తర్వాత స్థానాల్లో నాగర్‌కర్నూలు జిల్లా రాయవరం అక్షరరెడ్డి వృషభాలు, అనంతపురం జిల్లా ఏ నారాయణపురం షేక్ మహమ్మ ద్ షరీద్ వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లలాపురం గోవర్ధన్‌రెడ్డి వృషభాలు, వైఎస్సార్ కడప జిల్లా చెర్లోపల్లి, చిన్నరంగాపురం విష్ణువర్ధన్‌రెడ్డి, దనదీప్‌రెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లా రాయవరం ధనుష్‌రెడ్డి ఎద్దులు నిలిచాయి. ఎద్దుల యజమానులకు దాతలు రూ.50 వేలు, ట్రాక్టర్స్ సంఘం రూ.40 వేలు, పెద్ద వెంకటేష్, బిజ్జె నాగప్ప, కిల్లె శ్రీనివాసులు కలిసి రూ.30 వేలు, పెద్ద మునెప్ప రూ.20 వేలు, ఎస్ రంజిత్ రూ.10 వేలు, కుర్వ శ్రీనివాసులు రూ.5వేలు అందజేశారు.


