పాదయాత్రికుడికి అస్వస్థత
ఆత్మకూరురూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైలానికి కాలినడకన వెళుతున్న అనంతరపురానికి చెందిన శివభక్తుడు రమేష్ భీముని కొలను వద్ద తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీశైలం రేంచ్ అటవీ సిబ్బంది వెంటనే డోలీ కట్టి అందులో కై లాస ద్వారం వద్ద ఉన్న మెడికల్ క్యాంపునకు తరలించారు. వైద్య శిబ్బంది అత్యవసర చికిత్స అందించడంతో కొద్ది సేపటికి కోలుకున్నాడు. అస్వస్థతకు గురైన వ్యక్తిని కొండకోనల్లో మోసుకుని వైద్య శిబిరానికి చేర్చిన అటవీ సిబ్బందిని పాదయాత్రికులు అభినందించారు.
హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష తగదు
కర్నూలు(హాస్పిటల్): హెచ్‌ఐబీ బాధితుల పట్ల వివక్ష తగదని ఏపీ శాక్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ చెప్పారు. ఆయన మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఏఆర్‌టీ సెంటర్, ఐసీటీసీ, మైక్రోబయాలజీ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరీక్షలు చేసే విధానం, నెలవారీ రిపోర్ట్‌లు, హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చిన వారికి ఇచ్చే చికిత్సలు, మందులు, వైద్యసేవలు, సదుపాయాల గురించి తెలుసుకున్నారు. గర్భిణులకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపకుండా అన్ని ప్రాంతాల వారికి సమానంగా మందులు ఇవ్వాలని సూచించారు. సకాలంలో రిపోర్టులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, సిబ్బంది వారి పనితీరు మరింత మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్లు అలీ హైదర్, దేవిశంకర్‌గౌడ్ ఉన్నారు.
పాదయాత్రికుడికి అస్వస్థత


