మంచాలమ్మా.. దీవించమ్మా!
మంత్రాలయం: మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రంలోని మండ్యాలో తయారు చేయించిన బెల్లం అచ్చులతో, చెరకు గడలతో, గడ్డితో ఆదివారం అలంకరించారు. విశేష పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం మహాద్వారం నుంచి ‘మంచాలమ్మా.. దీవించమ్మా’ అంటూ భక్తులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి కుంకుమ అర్చన, అభిషేకం చేశారు. అనంతరం మూల బృందవనానికి నిత్య పూజలు నిర్వహించారు. అమ్మవారికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి, మహా మంగళ హారతి చేశారు. శ్రీ మఠం ప్రాంగణంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం పూజ నిర్వహించారు. బళ్లారి జిల్లాలో తెక్కలకోటకు చెందిన ఏడు వందల మంది భక్తులు కాలినడకతో 120 కిలో మీటర్లు దూరం నుంచి రాఘవేంద్ర స్వామి మఠం చేరుకున్నారు.
మంచాలమ్మా.. దీవించమ్మా!


