అతి శుభ్రతా.. ఓ రోగమే! | - | Sakshi
Sakshi News home page

అతి శుభ్రతా.. ఓ రోగమే!

Feb 8 2026 4:02 AM | Updated on Feb 8 2026 4:02 AM

అతి శ

అతి శుభ్రతా.. ఓ రోగమే!

వైద్యుల వద్ద చికిత్స తీసుకోవాలి

కర్నూలు నగరంలోని గణేష్‌నగర్‌లో ఉంటు న్న ఓ వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతాధికారి. ఏ చిన్న పని చేసినా వెంటనే చేతులు కడగటం ఆయన నైజం. ఎంతగా అంటే ఎవ్వరికై నా షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా సరే వెంటనే దగ్గరున్న పేపర్‌తో తుడుచుకోవడమో లేక శానిటైజర్‌తో కడుక్కోవడమో చేస్తుంటారు.

నంద్యాలకు చెందిన రామేశ్వరమ్మ గృహిణి. ఇంటికి ఎవ్వరైనా వచ్చి వెళ్లారంటే చాలు వారు వెళ్లిన వెంటనే ఇళ్లంతా శుభ్రం చేస్తుంది. ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సైతం తాళం వేశామా లేదా, తలుపులన్నీ మూశామా లేదా, గ్యాస్‌ బంద్‌ చేశానా.. లేదా.. అని మళ్లీ మళ్లీ చెక్‌ చేస్తుంది. బయటకు ఎక్కడికై నా వెళ్లినా సరే ఇంటిపైనే ధ్యాస.

..సమాజంలో ఇలాంటి వారు మీకు కూడా తరచూ కనిపిస్తుంటారు కదూ. ఇదో చాదస్తమనో, అనుమానమనో లేక ఇతర పేర్లేవో పెట్టుకుని సర్దుకుంటారు. కానీ ఇది కూడా ఒక లాంటి మానసి క రోగమని వైద్యులు చెబుతున్నారు. దీనినే వైద్యపరిభాషలో ఆబ్సెసివ్‌ కంపల్సరీ డిజార్డర్‌ (ఓసీడీ) అంటారు.

కర్నూలు(హాస్పిటల్‌): ఆబ్సెసివ్‌ కంపల్సరీ డిజార్డర్‌(ఓసీడీ) వ్యాధి గురించి అవగాహన ఉన్న కుటుంబసభ్యులు మాత్రమే బాధితులను వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌, చికిత్స ఇస్తుంటారు. మిగిలిన వారు జీవితాంతం అలాగే బాధపడుతున్నారు. ఓసీడీ అనేది ఒక భిన్నమైన మానసిక సమస్య. ఇలాంటి వారిని చూసి సమాజంలోని చాలా మంది జాలి చూపడం, ఏహ్యభావంతో చూడటం, విస్సుక్కోవడం చేస్తుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు తమకు ఒక ఆరోగ్య సమస్య ఉందన్న విషయమూ గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా ఎవరికీ చెప్పుకుంటే ఏమనుకుంటారోనని.. మదనపడుతుంటారు. వారి సమస్యను ఇతరులతో చెప్పుకోలేరు, బయట పడే మార్గం వెతుక్కోలేక నరకం అనుభవిస్తుంటారు. ఓసీడీతో బాధపడేవారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. ఎంతగా అంటే సమాజంలో 3 శాతానికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కొందరిలో 18 ఏళ్ల నుంచే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో సమస్య వచ్చిన ఐదేళ్ల తర్వాత గుర్తించి వైద్యులను కలుస్తుంటారు. ఇటీవల ఈ మానసిక సమస్య గురించి సోషల్‌ మీడియాలో కథనాలు వస్తుండటంతో అవగాహన పెంచుకుని వైద్యులను కలుస్తున్నారు.

ఓసీడీ లక్షణాలు

● ఓసీడీతో బాధపడుతున్న వారికి ఒకే ఆలోచన పదే పదే వస్తుంది. ఈ ఆలోచన వాస్తవానికి దూరంగా ఉన్నా, అర్థంలేని ఆలోచనలను బాధితులు గుర్తించినా, వాటిని నిగ్రహించుకునే శక్తి మాత్రం వారికి ఉండదు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడలేక, అవసరమైన పనులపై శ్రద్ధ చూపలేక వారు నిరంతరం ఆందోళనకు గురవుతుంటారు. ఈ ఆలోచనలనే ఆబ్సెసివ్‌ కంపల్సరీ డిజార్డర్‌ అంటారు.

● అతి శుభ్రతకు వీరు ప్రాధాన్యత ఇస్తారు. చేతులకు మురికి అంటిందేమోనని భయపడుతుంటారు. చేసిన పనినే పదే పదే చేస్తుంటారు.

● అనుమానాలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. అతిభయం, అతి క్రమశిక్షణ వీరికి ఉంటుంది. వీరు తమ అజాగ్రత్త కారణంగా ఇతరులకు హాని కలిగిస్తామేమోనని భయపడుతుంటారు.

● తమను ఇతరులతో పోల్చి చూసుకోవడం, ఇతరులను పరీక్షించడం చేస్తుంటారు. సెక్స్‌వల్‌ లేదా ఇతర రకాలుగా హాని కలిగిస్తాయనే ఆలోచనలు వచ్చే వారు తమ తప్పుడు ఆలోచనలకు క్షమించాలని దైవాన్ని వేడుకుంటూ ఉంటారు.

● వీరు ఇంట్లో కూడా హానికరమైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని దాచడం, బయట పారేయడం చేస్తుంటారు.

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగానికి ప్రతి రోజూ వంద మంది దాకా వివిధ మానసిక జబ్బులతో చికిత్స కోసం వస్తారు. వారిలో 2 నుంచి 3 శాతం మందిలో ఓసీడీ లక్షణాలు ఉంటాయి. వ్యాధి తీవ్రతను బట్టి మందులు, కౌన్సిలింగ్‌ ద్వారా నయం చేస్తాం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అటు బాధితులకు, కుటుంబసభ్యులు, కార్యాలయంలో అయితే సహొద్యోగులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. – డాక్టర్‌ నాగేశ్వరరావు, మానసిక

వ్యాధుల విభాగాధిపతి, జీజీహెచ్‌, కర్నూలు

ఓసీడీ సమస్యకు కారణాలు

పలు కారణాలతో మెదడులో కలిగే రసాయన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది.

పిల్లల్లో స్ట్రెప్టకోకస్‌ ఇన్‌ఫెక్షన్‌ తర్వాత ఈ వ్యాధి రావచ్చు. తలకు గాయాలు తగిలినప్పుడు, మెనింజైటిస్‌ వంటి వ్యాధుల తర్వాత ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.

ఒక కుటుంబంలో ఎవరికై నా ఈ వ్యాధి ఉన్నప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికై నా ఈ సమస్య వచ్చే అవకాశాలు 33 శాతం ఉంటాయి. అయితే కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన అందరికీ రావాలని మాత్రం లేదు.

ప్రతిదీ శుభ్రంగా

ఉండాలనుకుంటున్నారా...!

శుభ్రంగా లేకపోతే నచ్చడం లేదా !

ఈ లక్షణాలతో పెరుగుతున్న

బాధితులు

ఇది కూడా ఒక రోగమేనట

వైద్యపరిభాషలో ఓసీడీగా పరిగణన

అతి శుభ్రతా.. ఓ రోగమే!1
1/1

అతి శుభ్రతా.. ఓ రోగమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement