ఆదోని జిల్లా సాధనకు ఐక్య పోరాటం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని జేఏసీ నాయకులు కృష్ణమూర్తిగౌడ్, దస్తగిరి నాయుడు, వీరేష్, రఘురామయ్య పిలుపునిచ్చారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 85వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్థానిక నాయకులు ఎన్.మల్లికార్జున, ఎస్.కుమార్, గాజుల రామాంజనేయులు, సుభాష్ చంద్రబోస్, ఎం.నాగరాజ్, ఎం.విజయ్, జగదీష్, కిరణ్ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక కీలకమైన పట్టణంగా, చారిత్రక, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత కలిగిన ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్నారు. ఆదోనిలో వేలాది పరిశ్రమలు ఉన్నాయన్నారు. జిల్లా అయితే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆదోని జిల్లా చేసేంతవరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు.
గుండెపోటుతో విద్యుత్‌శాఖ ఈఈ మృతి
ఆదోని అర్బన్: గుండెపోటుతో ఆదోని డివిజన్ విద్యుత్‌శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్మోహన్ ఆదివారం మృతిచెందారు. ఈయన ఐదు నెలల క్రితం కడప నుంచి ఆదోని కి బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈఈగా పదోన్నతి పొందారు. ఆదివారం ఉదయం స్వగృహంలో గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం వెంటనే 8వ వేతసంఘాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత తపాలా గ్రూపు సీ పోస్టుమ్యాన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దాపోస్టాఫీసులో అఖిల భారత తపాలా గ్రూపు సీ పోస్టుమ్యాన్‌అండ్ ఎంటీఎస్ యూనియన్ కర్నూలు డివిజన్ సంయుక్త ద్వైవార్షిక సమాశాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రం బిహార్ ఎన్నికల కోసం హడావుడిగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా...ఎన్నికలు ముగియగానే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకొని జీడీఎస్‌లు, పెన్షర్ ఉద్యోగుల కోసం వేతన సంఘంలోకి తీసుకొని అమలు చేసేలా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన చేపట్టే సార్వత్రిక సమ్మెకు యూనియన్ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కె.మురళీ, వై.మర్రెడ్డి, సీహెచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
మారథాన్‌లో కర్నూలు యువకుడి ప్రతిభ
కర్నూలు(సెంట్రల్): ఆరోవిల్లే అంతర్జాతీయ మారథాన్‌లో కర్నూలుకు చెందిన గంగాధర్ తన ప్రతిభ చూపారు. కఠినమైన 42 కిలోమీటర్ల ఆరోవిల్లే మారథాన్‌ను 4.40 గంటలకు పూర్తి చేసి మెడల్ అందుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి సమీపంలోని ఆరోవిల్లేలో ఆదివారం ఈ పోటీలు నిర్వహించారు. గతంలో కూడా గంగాధర్ హైదరాబాద్, వైజాగ్, 2025 సెప్టెంబర్‌లో కేంద్రపాలిత ప్రాంతం లడక్‌లోని హిమాలయ పర్వతాల్లో నిర్వహించిన 21 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేసి మెడల్ సాధించారు.
గల్లంతైన వ్యక్తి మృతి
నంద్యాల(అర్బన్): మూడు రోజుల క్రితం కేసీ కెనాల్‌లో గల్లంతైన నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(43) మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఈనెల 6న వ్యవసాయ పనుల నిమిత్తం బైక్‌తో కేసీ కెనాల్ కట్టపై వెళ్తూ ప్రమాదవశాత్తు సుబ్రమణ్యం కాల్వలో పడి పోయాడు. ఎంత గాలించినా మృతదేహం ఆచూకీ దొరకలేదు. మూడు రోజుల తర్వాత గ్రామ శివారు వద్ద కాల్వలో మృతదేహం తేలియాడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం సుబ్రమణ్యం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సింగారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆదోని జిల్లా సాధనకు ఐక్య పోరాటం
ఆదోని జిల్లా సాధనకు ఐక్య పోరాటం
ఆదోని జిల్లా సాధనకు ఐక్య పోరాటం


