గ్రీన్‌కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఓర్వకల్లు: గుమ్మితం తండా పరిధిని బహుళార్ధక సోలార్ పరిశ్రమను స్థాపించిన గ్రీన్‌కో యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహర్‌రెడ్డి ఆయన సతీమణి డీసీసీబీ మాజీ చైర్‌పర్సన్ విజయ మనోహరి శనివారం పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌కు ఫిర్యా దు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ దంపతులు మాట్లాడుతూ.. కాల్వ రెవెన్యూ పరిధిలో తమకు 10 ఎకరాలు భూమి ఉందని, అందులో మామిడి మొక్కలు ఉన్నాయన్నారు. భూమిలో సుమారు 4 ఎకరాల మేర గ్రీన్‌కో యాజమాన్యం వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మామిడి మొక్కలను తొలగించి వ్యర్థాలను నిల్వ చేసినట్లు తెలిపారు. పొలంలో డ్రిప్ పైపులను పగిలి పోయాయన్నారు. ఈ విషయంపై పలుసార్లు కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. గ్రీన్‌కో సిబ్బంది నిర్వాకంతో సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.


