భక్తిశ్రద్ధలతో శివయ్య జాతర
ఆదోని అర్బన్: మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని ఆదివారం శ్రీ శంభులింగేశ్వరస్వామి మండల దీక్ష శివ భక్తులు శివయ్య జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురుస్వామి శైలేంద్రనాథ్ స్వామి ఆధ్వర్యంలో శివ భక్తులు శివలింగాన్ని వాహనంలో కొలువుంచి ప్రధాన రహదారిలో ఓం నమఃశివాయ అను నామస్మరణతో ఊరేగించారు. ఆదోనిలో ప్రధాన రహదారులంతా ఓం నమశివాయ నామస్మరణతో మార్మోగింది. డోలు, సన్నాయిల మధ్య శివస్వాములు చిందులు, శివతాండవం చేసుకుంటూ ఊరేగింపు ముందు శివయ్య జాతరను వైభవంగా నిర్వహించారు. శివయ్య ఊరేగింపులో శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమై సంతపేట, బంగారు బజారు, మార్కండేయస్వామి, నిర్మల్ టాకీస్, కోట్ల కూడలి, పాత బస్టాండు మీదుగా శంభులింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంది. అనంతరం శివభక్తులకు అన్నదానం జరిగింది.
భక్తిశ్రద్ధలతో శివయ్య జాతర


