పెచ్చెరువు వద్ద అంబులెన్స్ సౌకర్యం
పాదయాత్ర భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయ సహకారాలు అందిస్తాం. మార్గమధ్యలో భక్తులకు అస్వస్థతకు గురైతే వారిని హుటాహుటిన వైద్యశాలకు తరలించేందుకు పెచ్చెరువు వద్ద అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. చిన్నచిన్న దెబ్బలు, గాయాలైన కూడా అటవీ సిబ్బంది వైద్య శిబిరాల ద్వారా వారికి కావాల్సిన వైద్యసేవలు అందిస్తాం. ఈ ఏడాది తొలిసారిగా వెంకటాపురం, దామర్లకుంట వద్ద అటవీశాఖ ఉచిత మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. – విఘ్నేష్, డీఎఫ్‌ఓ, ఆత్మకూరు


