ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు

Feb 10 2026 7:25 AM | Updated on Feb 10 2026 7:25 AM

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు

మూడు కేజీల గంజాయి స్వాధీనం

బేతంచెర్ల: పట్టణ శివారులో ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు సీఐ వెంటేశ్వరరావు తెలిపారు. సీఐ వివరాల మేరకు బనగానపల్లె రహదారిలో ఉన్న జగనన్న కాలనీలోని పొదలలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నంద్యాల టౌన్‌కు చెందిన చాకలి మనోజ్‌ కుమార్‌, బేతంచెర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన వడ్డె రత్న కుమార్‌, బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన గుర్రాల రామన్న గంజాయితో పట్టుబడ్డారు. డిప్యూటీ తహసీల్దార్‌ మారుతి, వీఆర్వోలు సురేంద్ర బాబు, విజయలక్ష్మి సమక్షంలో వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని వారి వద్ద మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో వీరికి గంజాయి సరఫరా చేసిన నంద్యాల టౌన్‌ చెందిన మహబూబ్‌ బాషా ఆలియాస్‌ ( మరాఠి) పరారీలో ఉన్నాడని, అతని పట్టుకునేందుకు స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ రమేష్‌ బాబు, పోలీస్‌ సిబ్బంది గిరి, గురుబాబు, రాజు నాయక్‌, సూర్య రామరాజు, శ్రీనివాస్‌, వెంకటేష్‌లను సీఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement