న్యాయ సుధ పరీక్షలు ప్రారంభం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలోని శ్రీ గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులకు న్యాయ సుధ పరీక్షలు ప్రారంభించారు. శ్రీ మఠం ఉంజలా మండపంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, వ్యాసరాజ పీఠాఽధిపతి శ్రీవిద్యాశ్రీషాతీర్థులు దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు న్యాయ సుధ పరీక్షలు జరగనున్నాయి. మూల్యంకనం కోసం దేశ నలుమూలల నుంచి ప్రముఖ పండితులను పిలిపించారు. సంస్కృత విద్యార్థుల పరీక్షల ప్రతిభను లైవ్ వీడియో ద్వారా పదాల తప్పులను, ఒప్పులను గుర్తించి మూల్యంకనం చేస్తారన్నారు. మొదటి రోజు ముగ్గురు విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత గిరిరాజాచార్, వేద పాఠశాల ప్రిన్సిపాల్ రమణ్‌రావ్, శ్రీ మన్యాయసుధ విద్యార్థులు పాల్గొన్నారు.
న్యాయ సుధ పరీక్షలు ప్రారంభం


