వేరుశనగ ధర తగ్గుతోంది
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అన్ని మార్కెట్‌ల్లో వేరుశనగ ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం మూడు మార్కెట్‌ల్లో కూడా ధరలు తగ్గడం గమనార్హం. ఎమ్మిగనూరు మార్కెట్‌లో గరిష్ట ధర రూ.6,980, ఆదోనిలో రూ.8,900, కర్నూలు మార్కెట్‌లో రూ.9,790 లభించింది. ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ధర దయనీయంగా ఉండగా.. కర్నూలు మార్కెట్‌లో కాస్త మెరుగ్గా ఉంది. ఇటీవల క్వింటా వేరుశనగ ధర రూ.15వేల వరకు చేరుకుంది.
– వాము వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. మార్కెట్‌కు వాము 1120 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.2,222, గరిష్ట ధర రూ.30,303 లభించింది. సగటు ధర రూ.16,099 మాత్రమే నమోదైంది. వ్యాపారుల సిండికేట్ వల్ల వాము రైతులకు అన్యాయం జరుగుతున్నట్లు తెలుస్తోంది.


