అగ్ని ప్రమాదంలో నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో నలుగురికి గాయాలు

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

అగ్ని ప్రమాదంలో నలుగురికి గాయాలు

అగ్ని ప్రమాదంలో నలుగురికి గాయాలు

కర్నూలు: కర్నూలు పాతబస్తీ బండిమెట్ట అంబాభవా ని ఆలయ సమీపంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. శివస్వాములకు భిక్ష ఏర్పా టు చేసేందుకు గ్యాస్‌ సిలిండర్‌ రెగ్యులేటర్‌ మారుస్తుండగా పక్కనే ఉన్న దీపం సెగ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే వంట పనిచేస్తున్న లలితాబాయి, తులసి, కిట్టు, లక్ష్మి తదితరులు గాయపడ్డా రు. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

మాజీ ఎమ్మెల్యే చేయూత

కర్నూలు(టౌన్‌): పాతబస్తీలో నెలరోజుల వయస్సు ఉన్న శిశువుకు గుండె సంబంధిత సమస్య తెలెత్తింది. చికిత్స కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు కిమ్స్‌ అసుపత్రికెళ్లగా పరీక్షించి ఆపరేషన్‌ అవసరమని, ఇందుకు రూ. లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. అంత ఆర్థిక స్తోమత లేని మైనార్టీ వర్గానికి చెందిన ఆ దంపతులు వారం రోజుల క్రితం కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను కలిసి సమస్య విన్నవించారు. వెంటనే ఆయన స్పందించి కిమ్స్‌ ఆసుపత్రి యజమాన్యాంతో మాట్లాడి శిశువుకు అవసరమైన గుండె ఆపరేషన్‌ చేయించారు. మంగళవారం ఆ దంపతులు బిడ్డను తీసుకొని మాజీ ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement