బడిలో జ్ఞాపకాల జడివాన | - | Sakshi
Sakshi News home page

బడిలో జ్ఞాపకాల జడివాన

Feb 9 2026 7:26 AM | Updated on Feb 9 2026 7:26 AM

బడిలో

బడిలో జ్ఞాపకాల జడివాన

పండుగ వాతావరణంలో

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

68 ఏళ్ల క్రితం బ్యాచ్‌ నుంచి హాజరైన

పూర్వ విద్యార్థులు

పాఠశాల మ్యాగజైన్‌ను ఆవిష్కరిస్తున్న జెడ్పీచైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, తదితరులు

హాజరైన పూర్వ విద్యార్థులు

కొలిమిగుండ్ల: దశాబ్దాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రులు క్లాస్‌ రూమ్‌ల్లో అల్లరి, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, గ్రౌండ్‌లో ఆడుకున్న ఆట, పాటలను గుర్తు చేసుకొని మురిసిపోయారు. ‘రేయ్‌ ఎలా ఉన్నావ్‌..ఏం చేస్తున్నావు..పిల్లలు ఏం చేస్తున్నారు..పెళ్లిళ్లు అయిపోయాయా.. ఇలా ఎంతో ఆత్మీయంగా చాలా సంవత్సరాల తర్వాత కలుసు కున్న మిత్రులు సందడిగా గడిపారు. ఏడు పదుల వయస్సులోనూ హుషారుగా తమ బాల్య స్నేహితులతో చిన్న పిల్లలైపోయి సరదాగా గడిపారు. మధుర క్షణాలన్నీ ఆదివారం కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. పాఠశాల ప్రారంభమైన 1958 బ్యాచ్‌ మొద లు కొని ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి అయిన మైన్స్‌ అండ్‌ జియాలజీ మాజీ డైరక్టర్‌ వీడీ రాజగోపాల్‌ సహచర మిత్రులతో కలిసి ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా వ్యహరించి విజయవంతం అయ్యేలా కృషి చేశారు. పూర్వ విద్యార్థులు వెయ్యికి మందికి పైగానే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. పాఠశాల ఆవిర్భవానికి కారకులైన దివంగత గవర్నర్‌, కేంద్రమంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య చిత్ర పటానికి జెడ్పీచైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అప్పట్లో పాఠశాలను నిర్మించిన మీర్జాపురం నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ‘మేము మా పాఠశాల’ పేరుతో తయారు చేసిన మ్యాగజైన్‌ను ఆవిష్కరించి పూర్వ విద్యార్థులకు అందజేశారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. 1962లో మొదటి ఎస్సెల్సీ బ్యాచ్‌ విద్యార్థి అయిన రిటైర్డ్‌ హెచ్‌ఎం వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించారు. మైదుకూరు, అనంతపురంలో డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రప్రసాద్‌, వెంకట శివారెడి పాఠశాలలో చదువుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా బ్యాచ్‌లు వారీగా ఏర్పడి ఇష్టాగోష్టిగా చర్చించుకున్నారు. చదువుకున్న సమయంలోని తరగతి గదుల్లో కూర్చుని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కొండప్ప, సర్పంచ్‌ శివరాముడు తదితరులు పాల్గొన్నారు.

బడిలో జ్ఞాపకాల జడివాన1
1/2

బడిలో జ్ఞాపకాల జడివాన

బడిలో జ్ఞాపకాల జడివాన2
2/2

బడిలో జ్ఞాపకాల జడివాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement