వెదురు కర్రల వాహనం స్వాధీనం
బండిఆత్మకూరు: వెదురు కర్రలను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నామని బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ సాసిర్‌జా ఆదివారం తెలిపారు. మొబైల్ పార్టీ సిబ్బంది నారాయణాపురం పరిసరాల్లో గస్తీ నిర్వనిర్వహిస్తుండగా వెదురుకర్రల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం పరమటూరు వైపు వెళ్లిందన్నారు. వాహనాన్ని వెంబడించి కొత్తకోట హైవే జంక్షన్ వద్ద శనివారం తెల్లవారు జామున పట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్‌తో పాటు ఉన్న మరో వ్యక్తివాహనాన్ని వదిలి పరారయ్యారన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనా న్ని నంద్యాల ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయానికి తలరించామని తెలిపారు. అడవిలోనికి అక్రమంగా ప్రవేశించి వెదురు కలపను తరలిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బండిఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సాసిర్‌జా, మొబైల్‌పార్టీ డీఆర్‌ఓ నాగేంద్రయ్య, సిబ్బంది రత్నప్రభావతి పాల్గొన్నారు.


