రథవీధిలో టాయిలెట్లా..? | - | Sakshi
Sakshi News home page

రథవీధిలో టాయిలెట్లా..?

Feb 7 2026 10:13 AM | Updated on Feb 7 2026 10:13 AM

రథవీధిలో టాయిలెట్లా..?

రథవీధిలో టాయిలెట్లా..?

శ్రీశైల ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ఉన్న వీధిని రథవీధి అని అంటారు. ఈ వీధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిర్వహించే వాహనసేవల గ్రామోత్సవం ఈ రథవీధిలో నిర్వహిస్తారు. అయితే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా దేవస్థానం మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వాటిని ఏర్పాటు చేయడం మంచిదేకానీ.. వాటిని రఽథవీధిలో ఉంచడంపై భక్తులు మండిపడుతున్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవం తిరిగే ప్రదేశంలో టాయిలెట్లు ఏర్పాటు చేయడంపై దేవస్థాన అధికారుల తీరును భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటిని ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. – శ్రీశైలంటెంపుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement