వాతావరణ సమాచారంలో ఏడబ్ల్యూఎస్ ముఖ్య పాత్ర
ఓర్వకల్లు: ఎప్పటికప్పుడు వాతావరణంలోని మార్పులను గమనిస్తూ ఖచ్చితమైన వాతావరణ సమాచారం సేకరణలో ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్లూఎస్) కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. మంగళవారం కలెక్టర్ మండలంలోని నన్నూరు గ్రామ సమీపంలో ఏపీ ట్రాన్స్ కో ఆవరణలో అమర్చిన ఏడబ్ల్యూఎస్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఆర్టీజీఎస్‌కు అనుసంధానం చేశారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా వర్షపాతం, నేలలో తేమశాతం, వాతావరణ పీడనం, గాలి, ఉష్ణోగ్రతల వంటి వివరాలను ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాయని తెలిపారు. తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి, వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడానికి సంబంధిత వాతావరణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేంద్రానికి సంబంధించిన యంత్రాల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరుగకుండా చూడాలని, ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఓ భారతి, డీవైఎస్‌ఓ భాస్కర్, రామాంజనేయులు, ఏఎస్‌ఓ సరళకుమారి, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పరిశీలించిన కలెక్టర్ డాక్టర్.సిరి


