మామిడి తోట సాగు చేశా.. | - | Sakshi
Sakshi News home page

మామిడి తోట సాగు చేశా..

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

మామిడ

మామిడి తోట సాగు చేశా..

మామిడి తోట సాగు చేశా.. ఉపాధి నిర్వీర్యానికి కేంద్రం కుట్ర

మాకు 3.76 ఎకరాలు ఉన్నా గతంలో పంటలు పండక, పెట్టుబడులు కూడా రాక అప్పులై వాటిని తీర్చేందుకు రాజంపేట, రైల్వేకోడూరు వలస పోయే వాళ్లం. ఉపాధి పథకం అమలు చేసిన తర్వాత మా బతుకులు మారిపోయాయి. మామిడి చెట్లు నాటాం. మూడేళ్ల పాటు చెట్లను పెంచుకునేందుకు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఏటా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఉపాధి పథకంతో ఎంతో మేలు జరిగింది. వలసలు పోకుండా సొంతూళ్లోనే ఉంటున్నాం.

– ఆర్‌ గోలేనాయక్‌,

సన్నకారు రైతు, మీటేతండ

20 ఏళ్ల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్షాలు ఒత్తిడి తేవడంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది. ఎంతో మంది పేదలు, రైతులకు ఆసరాగా నిలిచిన పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వీబీజీ రామ్‌జీ పేరు మార్పు తప్ప ఒరిగేదేమీ లేదు. చేసిన పనులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదు. ఉపాధి పథకాన్ని తల లేని మొండెంగా తయారు చేసింది. 125 రోజులకు పని దినాలు పెంచుతున్నట్లు చెప్పి నిధులు తగ్గించింది. కొత్త చట్టంతో పేదల పొట్ట కొడుతోంది. – నబీ రసూల్‌, వ్యవసాయ

కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి

మామిడి తోట సాగు చేశా..
1
1/1

మామిడి తోట సాగు చేశా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement