నల్లమల లోయలో బొలెరో వాహనం బోల్తా
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడింది. బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన సద్దాం శనివారం బొలేరో వాహనంలో వరి గడ్డి కట్టలతో గిద్దలూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో సర్వనరసింహ స్వామి ఆలయ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి లోయలో పడింది. అదృష్టవశాత్తు సద్దాం ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద ఘటన శిరివెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని శిరివెళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు.


