దశమ భాగం దేవుడి సొమ్ము | - | Sakshi
Sakshi News home page

దశమ భాగం దేవుడి సొమ్ము

Feb 9 2026 7:26 AM | Updated on Feb 9 2026 7:26 AM

దశమ భ

దశమ భాగం దేవుడి సొమ్ము

బిషప్‌లు సంతోష్‌ ప్రసన్నరావు,

ఐజక్‌ వరప్రసాదరావు

ప్రార్థనలకు హాజరైన క్రైస్తవులు

ప్రదక్షిణలో పాల్గొన్న బిషప్‌లు

నంద్యాల(న్యూటౌన్‌): ప్రతి వ్యక్తి సంపాదనలో దశమ భాగం దేవుని సొత్తు అని, దశమ భాగం చెల్లిస్తే దేవుని మెండైన దీవెనలు లభించి వృద్ధి చెందు తారని నంద్యాల డయాసిస్‌ అధ్యక్షుడు ది రైట్‌ రెవరెండ్‌ సంతోష్‌ ప్రసన్నరావు, రాయలసీమ డయాసిస్‌ పీఠాధిపతి ది రైట్‌ రెవరెండ్‌ ఐజక్‌ వరప్రసాదరావు అన్నారు. ఆదివారం పట్టణంలో అతి పురాతన దేవాలయం హోలీక్రాస్‌ కెథడ్రల్‌ చర్చి 121వ ప్రతిష్టోత్సవం, హోలీ క్రాస్‌ సెయింటనరీ చర్చి మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఏటా చేపట్టే కోతపండుగ (కృతజ్ఞతార్పణల) వేడుకలను చేపట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాలు చర్చీల అభివృద్ధికి ఐమత్యతంతో ముందుకు వెళ్లినప్పుడూ అభివృద్ధి సాధింస్తారన్నారు. ఉదయం 7 గంలకు సెయింటినరీ చర్చి ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. హోలీక్రాస్‌ కెథడ్రల్‌ సెంటినరీ చర్చి డీనరీ చైర్మన్‌ కొత్తమాసి జోసెఫ్‌ మాట్లాడుతూ క్రైస్తవులు ఐకమత్యంతో ఉండి ఆలయాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఏసుక్రీస్తు మానవాళికి లోకరక్ష కుడై జన్మించారన్నారు. ఆయన ఆశయాలనే పాటి స్తూ క్రైస్తవులు దినదిన అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డయాసిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేంద్రబాబు, డీనరీ చైర్మన్లు నందం ఐజక్‌, గురువులు పాస్టర్‌ రాజు, డీనరీ చైర్మన్లు, గురువు లు, డయాసిస్‌ సెక్రటరీ ప్రభుదాసు, నంద్యాల డయాసిస్‌ సభ్యులు పాల్గొన్నారు.

దశమ భాగం దేవుడి సొమ్ము1
1/1

దశమ భాగం దేవుడి సొమ్ము

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement