వెట్టి చాకిరీ చట్టరీత్యా నేరం
కర్నూలు: వెట్టి చాకిరీ చట్ట రీత్యా నేరమని, బాండెడ్ లేబర్‌తో వెట్టి చాకిరీ చేయించుకున్న వారిపై మూడు సంవత్సరాలు కఠిన కారాగారశిక్ష, రూ.50 వేలు జరిమానా తప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదరి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. సోమవారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో బాండెడ్ లేబర్ నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రితో పాటు కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ఎవరైనా బాండెడ్ లేబర్ కింద పనిచేయించుకుంటే లేదా వారితో వెట్టి చాకిరీ చేయించుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు మాట్లాడుతూ ఆర్టికల్ 23, భారతీయ శిక్షా స్మృతి 370, 370ఎ, 374 గురించి తెలియజేశారు. జిల్లా న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఏఆర్‌డీఎస్ ఎన్‌జీఓ దామోదర్ రెడ్డి, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఎన్‌జీఓ మౌనిక తదితరులు పాల్గొన్నారు.


