సీఎంకు ఆదోని జిల్లా సెగ
● కలుగొట్ల సభలో విద్యార్థి సంఘాలు,
జేఏసీ నాయకుల ఆందోళన
● అదుపులో తీసుకున్న పోలీసులు
ఎమ్మిగనూరు టౌన్: కలుగొట్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ గ్రామ సభలో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో ఆదోని జిల్లా కావాలంటూ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. సభలో ఒక్కసారిగా లేచి నినాదాలు చేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. సీఎం చంద్రబాబు ఇలాంటి వారుంటారు డైవర్షన్ చేయడానికి అంటూ మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులో తీసుకొని ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో వైపు సీఎం ప్రసంగిస్తుండగానే రైతులు, మహిళలు సభ మధ్యలోనే తిరుగుముఖం పట్టారు. జనం పలుచగా హాజరు కావడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
సీఎంకు ఆదోని జిల్లా సెగ
సీఎంకు ఆదోని జిల్లా సెగ


