ఊరూరా బెల్ట్‌ షాపులు | - | Sakshi
Sakshi News home page

ఊరూరా బెల్ట్‌ షాపులు

Feb 9 2026 7:26 AM | Updated on Feb 9 2026 7:26 AM

ఊరూరా బెల్ట్‌ షాపులు

ఊరూరా బెల్ట్‌ షాపులు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన

కార్యదర్శి శశికళ కృష్ణమోహన్‌

హొళగుంద: చంద్రబాబు ప్రభుత్వంలో ఊరూరా బెల్ట్‌ షాపులు వెలిశాయని, మద్యం మత్తులో పేద ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్‌ అన్నారు. హొళగుందలో పార్టీ నాయకులతో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ తేల్చడంతో టీడీపీ నేతలకు బాధ ఎక్కువ అయ్యిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని వదిలి వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు కొత్త పింఛన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు. వేదావతి ప్రాజెక్ట్‌ పనులు చేపట్టాలని, ఎల్లెల్సీకి తాగునీరు వదలాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. హొళగుంద–ఢణాపురం రోడ్డు పనులు వెంటనే చేపట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ షఫీవుల్లా, నాయకులు వెంకటేష్‌, తావాఫ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement