‘చంద్రబాబు.. ఇరాన్‌లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’ | YSRCP Leader Jogi Ramesh On CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు.. ఇరాన్‌లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’

Mar 13 2026 9:55 PM | Updated on Mar 13 2026 10:05 PM

YSRCP Leader Jogi Ramesh On CM Chandrababu Naidu

విస్సన్నపేట:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.  తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడనని చంద‍్రబాబు అనుకున్నారని, నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి తాను రాజకీయం చేస్తున్నానని, ఇటువంటి బెదిరింపులకు భయపడనని జోగి రమేష్‌ స్పష్టం చేశారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత తగ్గుతా అనుకున్నావా.. వైఎస్సార్‌సీపీ జెండాను భుజం దింపుతా అనుకున్నావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. 

ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్న పేటలో మీడియాతో మాట్లాడారు జోగి రమేష్‌.  ‘ తిరువూరు గడ్డ అంటే వైఎస్సార్‌సీపీ అడ్డా. గ్రామాల్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడు.. జగనన్న ఎప్పుడు సీఎం అవుతాడు అంటున్నారు. నేను చంద్రబాబును ఒక మాటే కదే అన్నాను. కల్తీ లిక్కర్ నారా వారి సారా ఏరులై పారుతుంది  అనే కదా అన్నాను. ఒక్క మాటకే 83 రోజులు జైలుకు పంపించావు.  చంద్రబాబు విద్య,వైద్యాన్ని పడకెత్తించాడు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్  అంటూ మోసగించావు. లోకేష్ ఏమన్నాను చిప్ దొబ్బిందా అన్నాను అంతేగా. దానికై ఇంటిపై యాసిడ్ బాంబులతో దాడులు చేశారు. కల్తీ నెయ్యి గురించి  నానా యాగీ చేస్తున్నారే. సుప్రీంకోర్టు సైతం చెంప చెల్లుమనిపించింది’ అని మండిపడ్డారు.

ఇరాన్‌లో మాత్రమే ఖాళీ ఉంది..
చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా. చంద్రబాబు ప్రధానమంత్రి అవకాశం వస్తేనే వదిలేసుకున్నాడట. ఉపప్రధాని పదవి చాలా చీప్ అట.. మోదీ స్థాయి అయితేనే కావాలట. మోదీ స్థాయి పదవి కావాలంటే చంద్రబాబుకు ఇరాన్‌లో మాత్రమే ఖాళీ ఉంది’ అని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement