మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పదే పదే రాజకీయ విద్వేషాలతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు జనసేన నేతలు. గత రాత్రి మాజీమంత్రి పేర్ని నాని ఇంటి సమీపం రామానాయుడుపేట సెంటర్‌లో జనసేన జెండా ఏర్పాటుకు జనసేన నాయకుల యత్నించారు. అయితే వారిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.

అయితే ఈరోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) మళ్లీ కాంక్రీట్‌తో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలను అడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేత బొర్రా విఠల్‌ను బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించారు. ఇలా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన జనసేన కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. పోలీసుల వైఖరిపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


