చంద్రబాబు సర్కార్‌పై అమరావతి రైతుల ఆగ్రహం | Amaravati Parirakshana Samithi Jac Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌పై అమరావతి రైతుల ఆగ్రహం

Sep 26 2026 3:56 PM | Updated on Sep 26 2026 7:10 PM

Amaravati Parirakshana Samithi Jac Fires On Chandrababu Govt

సాక్షి, గుంటూరు: ‘‘అధికారులు వస్తారు.. పోతారు.. గ్రామ కంఠం విషయంలో తొలిరోజు నుంచి మాకు నష్టమే. బంగారం బిస్కెట్లు, డబ్బులు ఇచ్చినవారికి కిలో మీటర్‌ దూరం కూడా గ్రామకంఠం కిందే ఇచ్చారు. గతాన్ని తవ్వితే  చాలా ఇబ్బందులు వస్తాయని పెమ్మసాని చెప్పారు. గతంలో జరిగింది అధికారుల పొరపాటు కాదు.. రాజకీయ ప్రేరేపితంతోనే ఇచ్చారు’’ అంటూ అమరావతి రైతులు మండిపడ్డారు.

‘‘అసైన్డ్ భూములు, ఎండోమెంట్ భూములు, లంక భూములు , గ్రామకంఠం భూముల మీద సిట్ విచారణ జరిపించాలి. వీటన్నింటికీ మూల కారకుడు మంత్రి నారాయణ. నారాయణకు రైతు బాధలు తెలియవు. నారాయణ కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చాడు. రైతులను మభ్య పెట్టి లబ్ధి పొందడం తప్ప నారాయణ మరొకటి తెలియదు.

..మంత్రి నారాయణపై సిట్ విచారణ జరపాలి. సిట్ విచారణలో అధికారులను రెండో పార్ట్‌గా చేర్చాలి. సిట్ వేయడం వల్లే సాయికృష్ణ కేసులో నిజం బయటికివచ్చింది. గ్రామం కంఠాల విషయంలో చంద్రబాబు ఎందుకు జోక్యం చేసుకోడు. గ్రామ కంఠాల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలి’’ అని అమరావతి రైతులు డిమాండ్‌ చేశారు.

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఇదీ చదవండి: గణేష్‌ వేడుకల్లో కేసీఆర్‌ పాటలు.. కేటీఆర్‌ ఏమన్నారంటే?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement