రాష్ట్రంలో వెన్నుపోటు ప్రభుత్వ దౌర్జన్యకాండ | Tributes paid at the mortal remains of Kakumanu Rajasekhar | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో వెన్నుపోటు ప్రభుత్వ దౌర్జన్యకాండ

Sep 26 2026 5:25 AM | Updated on Sep 26 2026 5:25 AM

Tributes paid at the mortal remains of Kakumanu Rajasekhar

కాకుమాను రాజశేఖర్‌ హఠాన్మరణానికి చంద్రబాబు సర్కారే కారణం

కాకుమానుపై అక్రమ కేసులతో పోలీసు వేధింపులు

డీఎస్సీ నిరసనలో లాఠీచార్జీతోపాటు నెట్టివేయడంవల్లే ఆయనకు అస్వస్థత  

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లి హఠాన్మరణం 

వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆవేదన   

రాజశేఖర్‌ భౌతికకాయం వద్ద నివాళులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దౌర్జన్యకాండ సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందిన వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన ఒంగోలులోని క్లౌపేటలో శుక్రవారం  వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు, పలువురు పార్టీ నేతలు, నాయకులు సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పిం­ంచారు. పార్టీకి రాజశేఖర్‌ చేసిన సేవలను కొనియాడారు. కాకుమాను కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

డీఎస్సీలో అక్రమాలపై విజయవాడలో నిర్వహి­ంచిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పోలీ­సులు చేసిన లాఠీచార్జీతోపాటు, నెట్టివేయడంవల్లే తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని కాకుమాను కుటుంబ సభ్యులు వివరించారు. కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకరబాబు, వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్టీ సమన్వయకర్త చుండూరు రవి­బాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

ఖాకీలు వేధింపులవల్లే కాకుమాను మరణం: వైవీ, సజ్జల 
అనంతరం వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన యోధుడు కాకుమాను రాజశేఖర్‌ అని పేర్కొన్నారు. కాకుమాను కుటుంబానికి వైఎస్సార్‌సీపీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. కాకుమాను ఇటీవల వెన్నుపోటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారని,  డీఎస్సీలో అక్రమాలపై ఈనెల 22న విజయవాడ, శాప్‌ ఆఫీస్‌ వద్ద జరిగిన శాంతియుత నిరసనలో పాల్గొన్నారని పేర్కొన్నారు. 

ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జీకి దిగి నెట్టివేయడం వల్ల రెండుసార్లు కాకుమాను కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆ తర్వాత అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రిళ్లు ఇంటిపై పడి టెర్రరిస్టుల మాదిరి వేధించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని,  మెరుగైన వైద్యం కోసం హైదరా బాద్‌ వెళ్లిన కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరసన గళాన్ని అణగదొక్కడానికి చంద్రబాబు సర్కారు నరమేధం సాగిస్తోందని విమర్శించారు. బాబు దుర్మార్గ పాలనను ప్రజలు గమని­ంచాలని విన్నవించారు. 

అధికారం ఉందని పోలీసు వ్య­వస్థను కిరాయి సైన్యంలా వాడుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దౌర్జన్యకాండను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మె­ల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, డీఎస్సీ నిరసనలో పోలీసుల లాఠీచార్జితో తీవ్ర అస్వస్థతకు గురైన కాకుమాను అదేరోజు సాయంత్రం ఆ­స్ప­త్రిలో చూపించుకున్నారని, శరీరం బాగా నొప్పు­లున్నాయని, బీపీ బాగా పెరిగిందని, జ్వరం కూడా వచ్చిందని తనకు మెసేజ్‌ పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement