‘పడితే మొదటి కత్తిపోటు నా మీదే పడాలి’ | Tension breaks out again in Undrajavaram East Godavari | Sakshi
Sakshi News home page

‘పడితే మొదటి కత్తిపోటు నా మీదే పడాలి’

Sep 26 2026 4:28 PM | Updated on Sep 26 2026 5:59 PM

Tension breaks out again in Undrajavaram East Godavari

ఉండ్రాజవరం(తూర్పుగోదావరి జిల్లా): ఉండ్రాజవరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వంగవీటి రంగా విగ్రహాన్ని తొలగించడంపై ఆయన కుమార్తె ఆశాకిరణ్‌ ఉండ్రాజవరం చేరుకన్నారు. ఈ క్రమంలోనే ఆశాకిరణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, ఆశాకిరణ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న తన తండ్రి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని ఆశా కిరణ్‌ డిమాండ్‌ చేశారు.  రంగా విగ్రహం తొలగించిన చోటే ఆశాకిరణ బైఠాయించి నిరసన చేపట్టారు.  అదే రంగా అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. మరొకవైపు ఆశా కిరణ్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని , ఉండ్రాజవరం రంగా అభిమానుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆశా కిరణ డిమాండ్‌ చేశారు. 

పోలీసు లాఠీచార్జ్‌ చేస్తే నా పైనే మొదటి దెబ్బ పడాలి. కత్తిపోటు పడితే నా పైనే పోటుపడాలి.  రంగా అభిమానులు వెంట ఎవరున్నా లేకపోయినా నేనున్నా.  రంగా విగ్రహం ఎక్కడైనా ఆపితే ఖబర్దార్. వంగవీటి రంగాకి ఒక పార్టీ లేదు ఒక కులం లేదు. రంగా మీద అభిమానంతో పెట్టుకునే విగ్రహాలకి పార్టీ, కులం ఆపాదించొద్దు’ అని హెచ్చరించారు. 

ఉండ్రాజవరంలో హైటెన్షన్..  పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

ఇదీ చదవండి: ‘వ్యవస్థల్ని ధ్వంసం చేస్తే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement