breaking news
asha kiran
-
కాపులపై 'లాఠీచార్జ్'
నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహం తొలగింపును ప్రశ్నించిన కాపులపై పోలీసులు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా లాఠీచార్జ్ జరిపి పలువురిని అదుపులోనికి తీసుకున్నారు. తొలుత రంగా కుమార్తె ఆశాకిరణ్ ఉండ్రాజవరంలో రంగా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. రెండు రోజులుగా చోటుచేసుకున్న ఘటనలను ఆశాకిరణ్‌కు చెబుతూ భారీ ఎత్తున కాపులు గుమిగూడారు. ఆ సమయంలో కొవ్వూరు డీఎస్పీ డి.దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ పోలీస్ సిబ్బందితో అక్కడకు వచ్చి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆశాకిరణ్‌పై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆశాకిరణ్ ఇద్దరు బాడీగార్డులతో పాటు నలుగురిని వ్యాన్‌లో ఎక్కించుకుని పెరవలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆశాకిరణ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి కాపులతో పాటు ధర్నాకు దిగారు. కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు, తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్‌లు ఆశాకిరణ్‌తో చర్చించి ఆమెను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘పేద, బడుగు, బలహీన వర్గాల కోసం రంగా ప్రాణం ఇచ్చారని, ఆయన విగ్రహాల ఏర్పాటును ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఖబడ్దార్.. అంటూ హెచ్చరించారు. కాగా, విగ్రహాన్ని తొలగించి, దిమ్మను ధ్వంసం చేసిన ప్రదేశంలోనే రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తన ఇంటి ముందు ఉన్న స్థలాన్ని ఇచ్చేందుకు ఆయన అభిమాని కోటిపల్లి తాతారావు ముందుకొచ్చారు. దీంతో అక్కడే విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగా అభిమానులు అంగీకరించారు. -
ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్
-
‘పడితే మొదటి కత్తిపోటు నా మీదే పడాలి’
ఉండ్రాజవరం(తూర్పుగోదావరి జిల్లా): ఉండ్రాజవరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వంగవీటి రంగా విగ్రహాన్ని తొలగించడంపై ఆయన కుమార్తె ఆశాకిరణ్ ఉండ్రాజవరం చేరుకన్నారు. ఈ క్రమంలోనే ఆశాకిరణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, ఆశాకిరణ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో ఉన్న తన తండ్రి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని ఆశా కిరణ్ డిమాండ్ చేశారు. రంగా విగ్రహం తొలగించిన చోటే ఆశాకిరణ బైఠాయించి నిరసన చేపట్టారు. అదే రంగా అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. మరొకవైపు ఆశా కిరణ్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని , ఉండ్రాజవరం రంగా అభిమానుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆశా కిరణ డిమాండ్ చేశారు. పోలీసు లాఠీచార్జ్ చేస్తే నా పైనే మొదటి దెబ్బ పడాలి. కత్తిపోటు పడితే నా పైనే పోటుపడాలి. రంగా అభిమానులు వెంట ఎవరున్నా లేకపోయినా నేనున్నా. రంగా విగ్రహం ఎక్కడైనా ఆపితే ఖబర్దార్. వంగవీటి రంగాకి ఒక పార్టీ లేదు ఒక కులం లేదు. రంగా మీద అభిమానంతో పెట్టుకునే విగ్రహాలకి పార్టీ, కులం ఆపాదించొద్దు’ అని హెచ్చరించారు. ఇదీ చదవండి: ‘వ్యవస్థల్ని ధ్వంసం చేస్తే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది’ -
ఆళ్ల నానికి నివాళులు అర్పించిన వంగవీటి కుమార్తె ఆశా కిరణ్
-
రాజకీయం కాదు.. ప్రాణం ఇచ్చే స్నేహం! వంగవీటి ఆశా కిరణ్ కన్నీటి నివాళి..
-
ఇంకెంత కాలం? పవన్ కళ్యాణ్ కు వంగవీటి రంగా కూతురు విజ్ఞప్తి
-
Asha Kiran: క్రిమినల్ అయితే చంపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు
-
నాన్నకు చావు లేదు.. ఎప్పుడూ బ్రతికే ఉంటారు..
-
రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్?
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): తాను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది త్వరలో ప్రకటిస్తానని దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ చెప్పారు. ఆదివారం పాలకొల్లులో కార్తీక వన సమారాధనలో పాల్గొనేందుకు పయనమైన ఆమె.. తొలుత విజయవాడలోని తమ ఇంటి ఎదుట వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఈ రోజు నుంచే ప్రజా జీవితం ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ‘ఇకపై అందరికీ అందుబాటులో ఉంటా. ఎవరికైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అండగా ఉంటా’ అని స్పష్టం చేశారు. కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కొంత కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నానని, రాధా రంగా మిత్ర మండలితో కొంత గ్యాప్ ఏర్పడిందని చెప్పారు.ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు తాను ప్రజా జీవితంలోకి వస్తున్నానని తెలిపారు. తన అన్న వంగవీటి రాధాకృష్ణతో తనకెలాంటి విభేదాలు లేవని, ఇద్దరిదీ రంగా ఆశయ సాధనే లక్ష్యమన్నారు. ఇకపై రాధా రంగా మిత్ర మండలి, రంగా ఫ్యాన్స్‌తో కలుస్తానని, అన్ని అంశాలు చర్చిస్తానన్నారు. పబ్లిక్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. రాజకీయ ఆరంగేట్రంపై తర్వాత స్పందిస్తానని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల కోసం రాలేదని, సందర్భం వచ్చినప్పుడు అందరి సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అనంతరం ఆమె రాధా రంగా మిత్ర మండలితో కలిసి కార్తీక వన సమారాధనలో పాల్గొనేందుకు పాలకొల్లు బయలుదేరి వెళ్లారు. -
మిషన్ ఎవరెస్టుకు ఆశాకిరణ్‌రాణి ఎంపిక
శ్రీకాకుళం, కోటబొమ్మాళి: స్థానిక శ్రీ నలంద స్కూల్ పూర్వపు విద్యార్థిని, నర్సపురం గ్రామానికి చెందిన కొయ్య ఆశాకిరణ్‌రాణి మిషన్ ఎవరెస్టుకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక మహిళ ఈమె. ఆశాకిరణ్‌రాణి ఎంపిక పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మంచాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు వై.మురళి, నగేష్, నౌగాపు సుశీల, పద్మారావు, జగన్నాథరావు, కుసుము కుమారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఫిజియోథెరపీ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం టెక్కలిలో నివాసముంటున్న ఈమె యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ ఎవరెస్టు కార్యక్రమానికి వెళ్లేందుకు ఆసిక్తి చూపి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించటం చిన్నప్పటి నుంచి అభిలాషగా ఎంచుకున్న ఆశాకిరణ్‌రాణి మిషన్ ఎవరెస్టు కార్యక్రమానికి ఎంపికయ్యారు. -
‘మేం షాక్.. ఆరుబయట నగ్నంగా తిప్పుతున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ హయాంలో నడుస్తోన్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమం గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి అధికారుల నిర్లక్ష్యం, నిర్లజ్జ వ్యవహారాలు బయటకొచ్చాయి. కనీసం ఉండాల్సిన మానవతా విలువలు కూడా ఆ ఆశ్రమంలో లేకపోవడంపట్ల ఢిల్లీ మహిళా కమిషన్ విస్తుపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే.. ఢిల్లీలో ఆశా కిరణ్ అనే ఓ సంస్థ ఉంది. ఇందులో మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తారు. దీని బాధ్యతలు ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే, గత రెండు నెలల్లోనే దాదాపు 11మంది ప్రాణాలుకోల్పోయారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు అక్కడికి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్, మరో సభ్యురాలు ప్రమీలా గుప్తా వెళ్లారు. శనివారం రాత్రంతా అక్కడే ఉండి అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఆ సంస్థలో ఉన్నాయో వారి మాటల్లోనే చూస్తే.. ‘స్నానం చేసేందుకు ఆరు బయటే మహిళలను వివస్త్రలను చేసి వరుసగా నిలబెడుతున్నారు. పూర్తి నగ్నంగా ఉన్న స్త్రీలు కారిడార్‌లో అటు ఇటూ తిరుగుతున్నారు. అదే కారిడార్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటిని ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు పురుషులు. ఈ దృశ్యాలు చూసి మేం దిగ్భ్రాంతి చెందాం. పరిశుభ్రత కొరవడింది. సరిపోయే ఉద్యోగులు లేరు. మానసిక వికలాంగులకు కనీస హక్కులు లేవు. పెద్ద మొత్తంలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. 350మందికి మాత్రమే సరిపోయే చోటులో 450 మందిని ఉంచారు. దీనిపై ఇప్పటికే మేం సాంఘిక సంక్షేమ శాఖకు నోటీసులు ఇచ్చాం. 72గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించాం. అలాగే మేం కూడా ఒక ప్రత్యేక కమిటీని వేశాం. శర వేగంగా అది దర్యాప్తు పూర్తి చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం’ అని స్వాతి మాలివాల్ తెలిపారు.


