పాక్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన | Bethell ruled out, Pope, Carse, Lawrence return for Pakistan Tests | Sakshi
Sakshi News home page

పాక్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

Aug 6 2026 2:46 PM | Updated on Aug 6 2026 2:49 PM

Bethell ruled out, Pope, Carse, Lawrence return for Pakistan Tests

పాకిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు 16 మంది సభ్యుల ఇంగ్లండ్‌ జట్టును ప్రకటించారు. మోకాలి గాయం కారణంగా యువ ఆల్‌రౌండర్‌ జేకబ్‌ బేతెల్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో జోర్డాన్‌ కాక్స్‌కు తుది జట్టులో చోటు దక్కింది.

ఓల్లీ పోప్‌, బ్రైడన్‌ కార్స్‌, డాన్‌ లారెన్స్‌ తిరిగి చోటు సంపాదించారు. ముఖ్యంగా లారెన్స్‌ రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు.

సర్రే తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణిస్తున్న లారెన్స్‌ ప్రస్తుతం డివిజన్‌-1లో రెండో అత్యధిక పరుగుల స్కోరర్‌గా ఉన్నాడు. అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయనుండగా, ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నంబర్‌-6లో ఆడిన జేమీ స్మిత్‌ ఏడో స్థానానికి వెళ్లనున్నాడు.

బేతెల్‌ స్థానంలో నంబర్‌-3లో జోర్డాన్‌ కాక్స్‌ బ్యాటింగ్‌ చేయనున్నాడు. భారత్‌తో గత నెల జరిగిన వన్డే సిరీస్‌లో కుడి మోకాలికి గాయం కావడంతో బేతెల్‌ పాక్‌‌ సిరీస్‌కు దూరమయ్యాడు.

పోప్‌, కార్స్‌కు కూడా పునరాగమనం
ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్‌ సిరీస్‌ తర్వాత తొలిసారి ఓలీ పోప్‌, బ్రైడన్‌ కార్స్‌ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చారు. గాయం కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమైన కార్స్‌ తిరిగి జట్టులోకి రాగా, బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పోప్‌ను గతంలో జట్టు నుంచి తప్పించారు.

ఇక పేసర్‌ సామ్‌ కుక్‌కు కూడా రీకాల్‌ లభించింది. అతడు గత ఏడాది జింబాబ్వేతో టెస్టు అరంగేట్రం చేశాడు.

జో రూట్‌ మళ్లీ ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌
ఈ సిరీస్‌ ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌లో కొత్త శకానికి నాంది కానుంది. బెన్‌ స్టోక్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో, జో రూట్‌ 2022 తర్వాత మళ్లీ పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

బ్రెండన్‌ మెకల్లమ్‌ తర్వాత టెస్టు కోచ్‌గా స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ నియమితుడైనా, అతడు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి బాధ్యతలు చేపట్టనున్నాడు. అందువల్ల పాక్‌ సిరీస్‌కు మార్కస్‌ ట్రెస్కోథిక్‌ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

పాక్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు:
జో రూట్‌ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్‌, గస్‌ అట్కిన్సన్‌, షోయబ్‌ బషీర్‌, హ్యారీ బ్రూక్‌, బ్రైడన్‌ కార్స్‌, సామ్‌ కుక్‌, జోర్డాన్‌ కాక్స్‌, బెన్‌ డకెట్‌, మాథ్యూ ఫిషర్‌, ఎమిలియో గే, డాన్‌ లారెన్స్‌, ఒల్లీ పోప్‌, ఒల్లీ రాబిన్సన్‌, జేమీ స్మిత్‌, జోష్‌ టంగ్‌.**

ఆగస్టు 19న తొలి టెస్టు
ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ టెస్టు సిరీస్‌ ఆగస్టు 19న లీడ్స్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 27 నుంచి లార్డ్స్‌లో, మూడో టెస్టు సెప్టెంబర్‌ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.

ప్రస్తుతం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పట్టికలో ఇంగ్లండ్‌ ఏడో స్థానంలో ఉండగా, పాక్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement