న్యూజిలాండ్-ఎ జట్టు వైట్‌బాల్ సిరీస్‌లలో తలపడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా కివీస్ జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్‌తో పాటు ప్రత్యేకమైన వన్డే సిరీస్‌లోనూ పాల్గొననుంది. ఈ సిరీస్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఇందులో ఏకంగా 13 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండడం గమనార్హం. కివీస్ తొలుత టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ టాప్ ఎండ్ టీ20 సిరీస్‌లో మొత్తం 9 జట్లు పాల్గోనున్నాయి. ప్రతి జట్టు 6 రౌండ్-రాబిన్ మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం టాప్-4 జట్లు సెమీఫైనల్స్, ఫైనల్ ఆడతాయి.
ఈ సిరీస్ డార్విన్‌లో ఆగస్టు 21 నుండి 30 వరకు జరగనుంది. అనంతరం న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లు ఆస్ట్రేలియా-ఎతో కాకుండా టాస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, నేపాల్ వంటి జట్లతో కివీస్ ఆడనుండడం విశేషం.
న్యూజిలాండ్ ‘ఎ’ 16 మంది సభ్యుల జట్టు
ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, మ్యాట్ బాయిల్, మ్యాక్స్ చూ, కటేన్ క్లార్క్ (టీ20లకు మాత్రమే), క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫోక్స్‌క్రాఫ్ట్, జాక్ గిబ్సన్, మిచ్ హే, బెవాన్ జేకబ్స్, జేడెన్ లెన్నాక్స్, బెన్ లకేర్, రైస్ మారియూ (వన్డేలకు మాత్రమే), టిమ్ రాబిన్సన్.


