సామ్‌ బిల్లింగ్స్ సిక్స‌ర్ల వ‌ర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్‌ రాకెట్స్‌ | Sam Billings-Sixers-Trent Rockets Beat Birmingham-Hundred Mens-2026 | Sakshi
Sakshi News home page

Hundred 2026: సామ్‌ బిల్లింగ్స్ సిక్స‌ర్ల వ‌ర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్‌ రాకెట్స్‌

Aug 6 2026 11:28 AM | Updated on Aug 6 2026 11:38 AM

Sam Billings-Sixers-Trent Rockets Beat Birmingham-Hundred Mens-2026

Photo Credit: Hundred Twitter

హండ్రెడ్ మెన్స్ కాంపిటీష‌న్‌-2026లో ట్రెంట్ రాకెట్స్ ఐదో విజ‌యాన్ని అందుకొని టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. కెప్టెన్‌ సామ్ బిల్లింగ్స్ విధ్వంసానికి తోడు ఓపెన‌ర్లు రాణించ‌డంతో 7 వికెట్ల తేడాతో బ‌ర్మింగ్‌హ‌మ్ ఫోనిక్స్‌పై గెలుపొందింది. 112 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్ 83 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 116 ప‌రుగులు చేసింది. 

సామ్ బిలింగ్స్‌ (19 బంతుల్లో 31 నాటౌట్‌, 1 ఫోర్‌, మూడు సిక్స‌ర్లు) అజేయం కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించ‌గా, ఓపెన‌ర్లు బెన్ డ‌కెట్ (22), ఫిన్ అలెన్ (28) రాణించారు. బ‌ర్మింగ్‌హ‌మ్ బౌల‌ర్ల‌లో ఉస్మాన్ తారిఖ్ 2 వికెట్లు తీయ‌గా, బెన్‌డార్ఫుసిస్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హమ్ ఫొనిక్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. జో క్లార్క్ (45 బంతుల్లో 62) అర్ధసెంచరీ మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. లారి ఎవన్స్ (19) పర్వాలేదనిపించాడు.  

ట్రెంట్ బౌలర్లలో లూయిస్ గ్రెగొరి 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ ఆమిర్‌, మాట్ హెన్రీ,మిచెల్ సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఆరు మ్యాచ్‌ల్లో ఐదో విజయంతో ట్రెంట్ రాకెట్స్ 20 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా, బర్మింగ్‌హమ్ ఫొనిక్స్ నాలుగో పరాజయంతో పట్టికలో అట్టడుగున నిలిచింది.

 

చదవండి: కళ్లు చెదిరేలా షకీబ్‌ అల్‌ హసన్‌ ఆస్తుల విలువ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement