కళ్లు చెదిరేలా షకీబ్‌ అల్‌ హసన్‌ ఆస్తుల విలువ! | Bangladesh Star All-Rounder-Shakib Al Hasan Net Worth-Details | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరేలా షకీబ్‌ అల్‌ హసన్‌ ఆస్తుల విలువ!

Aug 6 2026 9:58 AM | Updated on Aug 6 2026 11:21 AM

Bangladesh Star All-Rounder-Shakib Al Hasan Net Worth-Details

Photo Credit: Twitter

బంగ్లాదేశ్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌, మాజీ ఎంపీ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఇంటిపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి క‌ల‌క‌లం రేపింది. కాగా త‌న‌ ఇంటిపై దాడితో ష‌కీబ్ అల్ హ‌స‌న్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌తో పాటు విదేశాల్లోనూ అనేక అక్ర‌మాస్తులు కూడ‌గ‌ట్టాడన్న ఆరోప‌ణ‌లు ష‌కీబ్ అల్ హ‌స‌న్‌పై వెల్లువెత్తాయి. దీంతో అస‌లు ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఆస్తుల నికర విలువ మొత్తం ఎంత‌? ఏయే దేశాల్లో అత‌డి పేరిట ఆస్తులు ఉన్నాయ‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

బంగ్లాదేశ్ క్రికెట్‌లో స్టార్ ఆల్‌రౌండ‌ర్‌గా పేరు పొందిన ష‌కీబ్ అల్ హ‌స‌న్ నిక‌ర ఆస్తుల విలువ అంచ‌నా 20 నుంచి 25 మిలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 190 నుంచి 230 కోట్ల పైచిలుకు మాటే) ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో బంగ్లాదేశ్ అగ్రశ్రేణి క్రికెటర్‌గా, షకీబ్ అల్ హసన్ త‌న స‌హ‌చ‌రులంద‌రికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు. 


Photo Credit: Twitter

కోట్ల ఆస్తులు..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అతని సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు , బోనస్‌లతో కలిపి, సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ. 2.85 కోట్ల నుంచి 4.75 కోట్ల వ‌ర‌కు అందుకుంటున్నాడు. దీంతో పాటు షకీబ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సహా ఇత‌ర టీ20 లీగ్‌ల ద్వారా కూడా భారీ మొత్తంలో అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో యాక్టివ్‌గా లేన‌ప్ప‌టికీ, ఇత‌ర టీ20 లీగుల్లో ఆడుతూ బాగానే సంపాదిస్తున్నాడు. 

ఇక బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్‌, ఇతర ఫ్రాంచైజీ లీగ్‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని, పన్నులు, ఇత‌ర ఖర్చులు పోను క్రికెట్ రూపంలోనే ష‌కీబ్ ఏడాదికి 95 నుంచి వంద కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జ‌ట్టు నుంచి వ‌చ్చిన ష‌కీబ్‌కు ఇది పెద్ద మొత్తమ‌నే చెప్పొచ్చు. అమెరికా నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందిన షకీబ్ అల్ హసన్.. షకీబ్ మోనార్క్ హోల్డింగ్స్ అనే బ్రోకరేజ్ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక బురాక్ కమోడిటీస్ ఎక్స్‌చేంజీ ద్వారా బంగారం వ్యాపారంలోనూ షకీబ్ యాక్టివ్‌గా కొనసాగుతున్నాడు. ఇవే గాక విదేశాల్లోనూ షకీబ్ పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం.

స్టార్ ఆల్‌రౌండర్‌గా..
2006లో బం‍గ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షకీబ్ అల్ హసన్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. షకీబ్ తన కెరీర్‌లో 71 టెస్టుల్లో 4,609 పరుగులు చేయడంతో పాటు 246 వికెట్లు తీశాడు. 247 వన్డేల్లో 7,570 పరుగులు, 317 వికెట్లు, 129 టీ20ల్లో 2551 పరుగులు, 149 వికెట్లు పడగొట్టాడు. ఇక షకీబ్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌ 19 టెస్టు‍‍ల్లో 4 విజయాలు, 62 వన్డేల్లో 27 విజయాలు, 39 టీ20ల్లో 16 విజయాలు సాధించింది.


Photo Credit: Twitter

వివాదాలు..
షకీబ్ క్రికెట్ ప్రపంచంలోనూ, వెలుపలా అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ఉన్నాడు. ఒక క్రికెటర్‌గా, అతను తన తొందరపాటు స్వభావం, దుష్ప్రవర్తనకు సంబంధించిన అనేక క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నాడు.  2019 వన్డే ప్రపంచకప్ సమయంలో బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని నివేదించడంలో విఫలమైనందుకు, ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందున షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది.

ఇక 2024లో షకీబ్‌పై స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు రాగా, బంగ్లాదేశ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అతనికి జరిమానా విధించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, 2017లో అతని కంపెనీ IFIC బ్యాంక్ నుండి తీసుకున్న చెల్లించని రుణానికి సంబంధించి చెక్ మోసం ఆరోపణలు అతనిపై వచ్చాయి. 2025 ప్రారంభంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో, షకీబ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది.


Photo Credit: Twitter

వ్యక్తిగత జీవితం..
2012లో షకీబ్ అల్‌ హసన్‌.. బంగ్లాదేశీ అమెరికన్‌ అయిన ఉమ్మే అహ్మద్ శిశిర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. షకీబ్ ఇంగ్లీష్ క్లబ్ వోర్సెస్టర్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆమెను తొలిసారి కలిశాడు. వారికి అలైనా, ఎర్రమ్ అనే ఇద్దరు కుమార్తెలు సహా ఐజా అనే కుమారుడు ఉన్నారు.

చదవండి: స్వదేశానికి రషీద్‌ ఖాన్‌.. జింబాబ్వే ఆల్‌రౌండర్‌కు జాక్‌పాట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement