Photo Credit: Hundred Twitter
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్‌లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెల్ష్‌ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 20 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు (491 ఇన్నింగ్స్‌ల్లో 14,833 పరుగులు) చేసిన బ్యాటర్‌గా బట్లర్ చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో ఇప్పటివరకు టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (14,803 పరుగులు)రికార్డు బట్లర్ బద్దలు కొట్టాడు. బట్లర్, పొలార్డ్ తర్వాత విండీస్ హార్డ్ హిట్టర్, మాజీ ఆటగాడు క్రిస్ గేల్ (14, 562 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెల్ష్‌ఫైర్‌పై మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెల్ష్‌ఫైర్ విధించిన 156 పరుగుల టార్గెట్‌ను మాంచెస్టర్ జెయింట్స్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (36 బంతుల్లో 62 నాటౌట్), బట్లర్ (20 బంతుల్లో 51 నాటౌట్) ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
మరో ఓపెనర్ పాల్ వాల్టర్ (18 బంతుల్లో 37) రాణించాడు. అంతకముందు వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ (47 బంతుల్లో 71) విధ్వంసం సృష్టించగా, మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (48) రాణించాడు. మాంచెస్టర్ బౌలర్లలో గస్ అకిన్‌సన్ 2 వికెట్లు తీయగా, జోష్ టంగ్, పాల్ వాల్టర్ చెరొక వికెట్ తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
మార్కరమ్ స్థానంలో కెప్టెన్‌గా
ఇక మాంచెస్టర్ రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలగడంతో బట్లర్ తొలిసారి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్లోనే విజయాన్ని సాధించాడు. ఇప్పటికే సౌతాఫ్రికా వెళ్లిపోయిన మార్కరమ్ మిగతా టోర్నీకి దూరమవ్వడంతో బట్లర్ జట్టును నడిపించనున్నాడు.
ఇక బట్లర్ బ్యాటర్‌గా హండ్రెడ్ టోర్నీలో అదరగొడుతున్నాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 92.3 స్ట్రైక్ రేట్‌తో 277 పరుగులు సాధించాడు. ఇక మార్కరమ్ స్థానంలో మైకెల్ బ్రాస్‌వెల్‌ను తీసుకున్నట్లు మాంచెస్టర్ ఫ్రాంచైజీ ప్రకటించింది.
#JosButtler leaves the bowlers stunned 💥
He has now surpassed #KieronPollard to become the leading run scorer in T20 history! 🙌#TheHundred 2026 👉 Welsh Fire vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/AO9Q7O9TbK— Star Sports (@StarSportsIndia) August 5, 2026
Record breaker 📈👑 @josbuttler
Congratulations to Jos Buttler on becoming the all-time leading run scorer in T20 cricket.
⚡️ #StrikeTogether pic.twitter.com/FMuMEetTzL— Lancashire Cricket (@lancscricket) August 5, 2026
There’s a new king of T20 batting 👑
Jos Buttler surpasses Kieron Pollard’s 14,803 runs to become the leading run-scorer in T20 history ✨ pic.twitter.com/QlAYAFwKFU— Cricinfo (@cricinfo) August 5, 2026


