source: X
ది హండ్రెడ్ 2026 సీజన్ మధ్యలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. బుధవారం వెల్ష్ ఫైర్‌తో జరిగే ఆరో లీగ్ మ్యాచ్‌కు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.
మార్క్రమ్ టోర్నీ మధ్యలో వైదొలగడంతో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ వైట్‌బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది. మిగిలిన సీజన్ మొత్తానికి అతడే కెప్టెన్‌గా కొనసాగుతాడని పేర్కొంది.
బట్లర్‌కు అంతర్జాతీయ కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది. ఇంగ్లండ్‌కు 95 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు 44 విజయాలు సాధించాడు. 51 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు నాయకత్వం వహించి 26 విజయాలు అందించాడు.
టోర్నీలో కష్టాల్లో ఉన్న సూపర్ జెయింట్స్‌ను బట్లర్ తన నాయకత్వంతో నాకౌట్ దశకు తీసుకెళ్తాడని ఫ్రాంచైజీ ఆశిస్తోంది.
మార్క్రమ్ స్థానంలో మైకేల్ బ్రేస్‌వెల్
మార్క్రమ్ నిష్క్రమణను ప్రకటించిన వెంటనే అతడి స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌ను తీసుకున్నట్లు సూపర్ జెయింట్స్ వెల్లడించింది. మార్క్రమ్ స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాకపోయినా.. బ్రేస్‌వెల్ బ్యాట్‌తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడగలడు.
218 టీ20 మ్యాచ్‌ల్లో అతడు 3,717 పరుగులు చేసి, 105 వికెట్లు తీశాడు. ఇటీవల పీఎస్‌ఎల్ 2026లో పెషావర్ జల్మీ టైటిల్ గెలవడంలోనూ బ్రేస్‌వెల్ కీలక పాత్ర పోషించాడు.
సూపర్ జెయింట్స్‌కు నాకౌట్ అవకాశాలున్నాయా..?
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆరో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములను ఎదుర్కొంది. ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వెల్ష్ ఫైర్, సదరన్ బ్రేవ్, సన్‌రైజర్స్ లీడ్స్‌తో తలపడాల్సి ఉంది.
మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే సూపర్ జెయింట్స్ గరిష్ఠంగా 16 పాయింట్లు సాధించగలదు. దీంతో టాప్-3లోకి వెళ్లే అవకాశం ఇంకా ఉంది. అయితే నాకౌట్ బెర్త్ పూర్తిగా వారి చేతుల్లో లేదు. మిగతా జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా రావాల్సి ఉంటుంది.
ది హండ్రెడ్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి.


