breaking news
Super Giants
-
కెప్టెన్ మార్పు.. మార్క్రమ్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్
ది హండ్రెడ్ 2026 సీజన్ మధ్యలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. బుధవారం వెల్ష్ ఫైర్‌తో జరిగే ఆరో లీగ్ మ్యాచ్‌కు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.మార్క్రమ్ టోర్నీ మధ్యలో వైదొలగడంతో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ వైట్‌బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది. మిగిలిన సీజన్ మొత్తానికి అతడే కెప్టెన్‌గా కొనసాగుతాడని పేర్కొంది.బట్లర్‌కు అంతర్జాతీయ కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది. ఇంగ్లండ్‌కు 95 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు 44 విజయాలు సాధించాడు. 51 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు నాయకత్వం వహించి 26 విజయాలు అందించాడు.టోర్నీలో కష్టాల్లో ఉన్న సూపర్ జెయింట్స్‌ను బట్లర్ తన నాయకత్వంతో నాకౌట్ దశకు తీసుకెళ్తాడని ఫ్రాంచైజీ ఆశిస్తోంది.మార్క్రమ్ స్థానంలో మైకేల్ బ్రేస్వెల్మార్క్రమ్ నిష్క్రమణను ప్రకటించిన వెంటనే అతడి స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌ను తీసుకున్నట్లు సూపర్ జెయింట్స్ వెల్లడించింది. మార్క్రమ్ స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాకపోయినా.. బ్రేస్‌వెల్ బ్యాట్‌తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడగలడు. 218 టీ20 మ్యాచ్‌ల్లో అతడు 3,717 పరుగులు చేసి, 105 వికెట్లు తీశాడు. ఇటీవల పీఎస్ఎల్ 2026లో పెషావర్ జల్మీ టైటిల్ గెలవడంలోనూ బ్రేస్‌వెల్ కీలక పాత్ర పోషించాడు.సూపర్ జెయింట్స్‌కు నాకౌట్ అవకాశాలున్నాయా..?ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆరో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములను ఎదుర్కొంది. ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వెల్ష్ ఫైర్, సదరన్ బ్రేవ్, సన్‌రైజర్స్ లీడ్స్‌తో తలపడాల్సి ఉంది.మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే సూపర్ జెయింట్స్ గరిష్ఠంగా 16 పాయింట్లు సాధించగలదు. దీంతో టాప్-3లోకి వెళ్లే అవకాశం ఇంకా ఉంది. అయితే నాకౌట్ బెర్త్ పూర్తిగా వారి చేతుల్లో లేదు. మిగతా జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా రావాల్సి ఉంటుంది.ది హండ్రెడ్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. -
రూ. 27 కోట్లు.. కనీసం 27 పరుగులైనా చేయవా? పంత్‌కు గోయెంకా క్లాస్? (ఫోటోలు)
-
IPL 2025: పంత్‌కే లక్నో పగ్గాలు
కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఊహించిన విధంగానే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను సారథిగా నియమిస్తున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సోమవారం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ పంత్‌కు టీమ్ జెర్సీని అందిస్తూ తమ ఎల్ఎస్జీ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ వేలంలో రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో సొంతం చేసుకోవడంతోనే అతనే కెపె్టన్ కావడం దాదాపు ఖాయమైంది. ‘కొత్త ఆశలు, ఆశయాలతో పాటు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కొత్తగా మేం మొదలు పెడుతున్నాం. మీకందరికీ మా కొత్త కెప్టెన్ రిషభ్ పంత్‌ను పరిచయం చేస్తున్నాం. మా జట్టుకు సంబంధించి ఇదో కీలక క్షణం. మూడేళ్లు ముగిసిన తర్వాత మా ప్రణాళికల్లో మార్పులతో ముందుకు వెళ్లబోతున్నాం’ అని గోయెంకా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీమ్ మెంటార్ జహీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. ఐపీఎల్లో మూడు సీజన్లు ఆడిన లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆ జట్టు గత ఏడాది పూర్తిగా విఫలమైంది. దాంతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై కూడా విమర్శలు రావడంతో మార్పు అనివార్యమైంది. వేలంలో పంత్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇప్పుడు కెపె్టన్‌గా బాధ్యతలు అప్పగించింది. 2016 నుంచి 2024 వరకు ఢిల్లీ టీమ్ సభ్యుడైన పంత్... మూడేళ్లు నాయకుడిగా కూడా పని చేశాడు. 200 శాతం ప్రదర్శన కనబరుస్తా... దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడినా... పంత్ స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్. గతంలో ఇది ఉత్తరప్రదేశ్‌లోనే భాగం. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ఐపీఎల్ టీమ్‌కు అంటే దాదాపుగా సొంత టీమ్‌కు అతను ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. లక్నో మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నా వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా 200 శాతం కష్టపడతానని మీకు మాటిస్తున్నా. కొత్త ఉత్సాహంతో కొత్త జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. నాకు ఇచి్చన బాధ్యతలతో సంతోషంగా ఉన్నా. టీమ్‌లో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. కొత్త లక్ష్యాలతో మా ప్రయాణం మొదలైంది’ అని పంత్ వ్యాఖ్యానించాడు. కెపె్టన్‌గా తాను ఇప్పటికే ఎంతో నేర్చుకున్నానని పంత్ అన్నాడు. ‘ఇక్కడ కొత్త ఫ్రాంచైజీ, కొత్త ఆరంభం అని నాకు తెలుసు. కానీ కెప్టెన్సీ బాధ్యతలు నాకు కొత్త కాదు. అయితే మా జట్టు అవసరాలను బట్టి నేనేం చేయాలో మేనేజ్మెంట్తో చర్చిస్తా. సహచరులకు అండగా ఎలా నిలవాలో, వారినుంచి మంచి ప్రదర్శన ఎలా రాబట్టాలో రోహిత్ శర్మ నుంచి, ఇతర సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా ఎంతో నేర్చుకున్నా. ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే విషయంపై నాకు స్పష్టత ఉంది’ అని పంత్ వివరించాడు. పంత్‌లో సత్తా ఉంది... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న 2016లో పంత్ మొదటిసారి ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్‌తో పంత్ మళ్లీ కలిసి పని చేయనున్నాడు. ‘ఎన్నో ఆటుపోట్లను దాటి పంత్ క్రికెటర్‌గా ఎదగడం నేను ప్రత్యక్షంగా చూశాను. తన ఆటతో అతను అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. ఇకపై అతను సాధించాల్సింది ఎంతో ఉంది. ఇక్కడ పంత్ ఆ పని చేయగలడు’ అని జహీర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తమ జట్టు మిడిలార్డర్లో అంతా ఎడంచేతి వాటం బ్యాటర్లు ఉండటం కూడా ఒకరకమైన వ్యూహమని తెలిపాడు. -
పుణే జట్టు పేరు సూపర్ జెయింట్స్
కెప్టెన్‌గా ధోని పేరు ప్రకటన కోల్‌కతా: ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ పుణే జట్టు తమ పేరును ప్రకటించింది. వచ్చే రెండు సీజన్ల పాటు ఈ జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (ఆర్పీఎస్జీ) పేరుతో బరిలోకి దిగుతుంది. అలాగే తమ జట్టుకు కెప్టెన్ ధోని అని అధికారికంగా ప్రకటించింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ జట్టు పేరు, లోగో ఆవిష్కరించారు. సంజీవ్ గోయెంకాకు చెందిన ఈ జట్టుకు వారి గ్రూప్ పేరు ఆర్పీజీ వచ్చేలా పేరు పెట్టినట్లు కనిపిస్తోంది. అలాగే గతంలో రాజస్తాన్ జట్టుతో కలిసి పని చేసిన రఘు అయ్యర్ ఇకపై గోయెంకా గ్రూప్ స్పోర్ట్స్ విభాగానికి సీఈఓగా పని చేస్తారు.


