ఫిన్‌ అలెన్‌ విధ్వంసం.. కేవలం 35 బంతుల్లోనే | Finn Allen-powered Trent Rockets soar into top spot | Sakshi
Sakshi News home page

The Hundred: ఫిన్‌ అలెన్‌ విధ్వంసం.. కేవలం 35 బంతుల్లోనే

Aug 1 2026 11:55 AM | Updated on Aug 1 2026 11:55 AM

Finn Allen-powered Trent Rockets soar into top spot

ది హండ్రెడ్ మెన్స్ కాంపిటేష‌న్‌-2026లో ట్రెంట్ రాకెట్స్ హ్యాట్రిక్ విజ‌యాల‌ను న‌మోదు చేసింది. శుక్ర‌వారం ఓల్డ్‌ట్రాఫ‌ర్డ్ వేదిక‌గా మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూప‌ర్ జెయిట్స్ నిర్ధేశిత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగలిగింది. మాంచెస్టర్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌(55), లీస్‌ డుప్లే(40) రాణించారు. రాకెట్స్‌ బౌలర్లలో క్రెయిగ్‌ ఓవర్టన్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.

అలెన్ విధ్వంసం
అనంతరం 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాకెట్స్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ బెన్ డకెట్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ టామ్ బాంటన్ వికెట్లను వరుస ఓవర్లలో ట్రెంట్ రాకెట్స్ కోల్పోయింది. ఈ సమయంలో మరో ఓపెనర్‌, న్యూజిలాండ్ పవర్ హిట్టర్ ఫిల్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. 

అలెన్‌ కేవలం 35 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. ఫలితంగా ఈ లక్ష్యాన్ని ట్రెంట్‌ రాకెట్స్‌ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 87 బంతుల్లోనే చేధించింది. మాంచెస్టర్‌ బౌలర్లలో గాస్‌ అట్కిన్సన్‌, సోనీ బాకర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో రాకెట్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement