కెప్టెన్సీకి గుడ్‌బై.. ఇక ఆటగాడిగానే కొనసాగుతా! | Netherlands Leadership Change, Scott Edwards Steps Aside And De Leede Named New Captain, More Details Inside | Sakshi
Sakshi News home page

కెప్టెన్సీకి గుడ్‌బై.. ఇక ఆటగాడిగానే కొనసాగుతా!

Aug 1 2026 10:58 AM | Updated on Aug 1 2026 11:47 AM

Scott Edwards steps down de Leede takes over as Netherlands captain

బాస్‌ డీ లీడేతో ఎడ్‌వర్డ్స్‌ (PC: Netherlands Cricket)

నెదర్లాండ్స్‌ పురుషుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ పదవి నుంచి స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ తప్పుకొన్నాడు. ఆటగాడిగా జట్టుకు విశేష సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇందుకు సంబంధించి నెదర్లాండ్స్‌ క్రికెట్‌ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

విజయవంతమైన సారథి
కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌.. 2022 జూన్‌లో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా డచ్‌ జట్టు సారథిగా పీటర్‌ సీలర్‌ స్థానాన్ని భర్తీ చేశాడు. ఎడ్‌వర్డ్స్‌ తన కెరీర్‌లో 56 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఇందులో నెదర్లాండ్స్‌ 24 మ్యాచ్‌లు గెలిచి.. 29 ఓడిపోయింది.

ఇక అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా ఇప్పటికి 74 వన్డేలు, 86 టీ20 మ్యాచ్‌లు ఆడిన స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌.. వన్డేల్లో 2391, టీ20లలో 1316 పరుగులు సాధించాడు. ఈ 29 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో వన్డేల్లో 24, టీ20లలో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

అందుకే ఈ నిర్ణయం
ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2 మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ ప్రకటించాడు. ఈ విషయం గురించి సహచర సభ్యులతో మాట్లాడుతూ.. ‘‘అకస్మాత్తుగా మీకు ఈ విషయం చెబుతున్నందుకు క్షమించండి. ఈ క్షణం నుంచి నేను కెప్టెన్‌గా వైదొలుగుతున్నాను.

ఆటగాడిగా జట్టుకు మరింత ఉపయోగపడటమే నా లక్ష్యం. అందుకే ఈ నిర్ణయం. ఈ బృందం ప్రత్యేకం. గత నాలుగేళ్లలో మీరు అందించిన సహకారం మరువలేనిది. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన అతిపెద్ద గౌరవం’’ అని స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా 26 ఏళ్ల ఆల్‌రౌండర్‌ బాస్‌ డీ లీడే ఎంపికయ్యాడు.

చదవండి: ఇంగ్లండ్‌ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement